తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆమె మరణాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెపథ్యంలోనే అమ్మ మరణాన్ని తట్టుకోలేక ఇప్పటివరకు 470 మంది హఠాన్మరణానికి గురయ్యారని అన్నాడీఎంకే తెలిపింది. వారి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. జయలలిత అనారోగ్యంతో సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలో రెండున్నర నెలల పాటు చికిత్స తీసుకున్న అమ్మ ఈ నెల 5న కన్నుమూసిన విషయం తెలిసిందే. జయలలితకు ఆసుపత్రిలో 75 రోజుల పాటు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. ఈ 75 రోజుల పాటు చికిత్స అందించినందుకు గామ్ను ఖర్చు రూ.6 కోట్లు కాగా రూ.90 కోట్ల బిల్లును అపోలో ఆసుపత్రి డిమాండ్ చేసిందని, ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
జయలలిత అపోలోలో చేసిన ఖర్చుపై జరుగుతోన్న ప్రచారాన్ని అటు అపోలో ఆసుపత్రి వర్గాలు, ఇటు అధికారులు ఖండించారు. జయ చికిత్సకు రూ.90 కోట్లు ఖర్చుకాలేదని, అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయిన మాట మాత్రం వాస్తవమని వైద్యులు అంటున్నారు. చికిత్స బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం ఇంతవరకు కోరలేదని స్పష్టం చేశారు.
Related