ప్రస్తుతం హోటల్లలో నాన్ వెజ్ తినాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. హోటల్ల యజమానుల కక్రుత్తి బుద్ధితో మటన్ బదులు ఇతర జంతువుల మాంసాన్ని కష్టమర్లకు వడ్డిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా బయటపడిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్‌లలో కుక్కబిర్యానీనా అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. కుక్క మాంసంతో ఇద్దరు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటమే కాదు తాము ఆ కుక్క మాంసాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారో కూడా చెప్పేశారు. సంచలనం సృష్టిస్తున్న ఈ కుక్క మాంసం ఉదంతం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.
కృజిల్లాలోని జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో అడవి జంతువులు, పొట్టేలు మాంసం పేరుతో కుక్కల మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామపంచాయితి సిబ్బంది కాకుండా ఇద్దరు అపరచిత వ్యక్తులు కుక్కలను పట్టుకుండటాన్ని గమనించిన గ్రామస్తులు వారిపై నిఘా పెట్టారు. శుక్రవారం వారు గ్రామంలోని ఒక కుక్కను ఈడ్చుకెళ్లడం గమనించి గ్రామస్తులు వారిని అనుసరించగా ఒక ప్రదేశంలో వారు ఆ కుక్క తల, కాళ్లు నరికి చర్మం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గ్రామస్తులకు పట్టుబడిన ఇద్దరు కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు అని చెప్పిన ఆ ఇద్దరు తాము ఈ విధంగా కుక్కలను పట్టి చంపి ఆ మాంసాన్ని అడవి జంతువుల మాంసం గా విక్రయిస్తున్నామని చెప్పారు. అంతే కాదు అనుమానం వచ్చి గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ మాంసాన్ని కిలో 400 రూపాయలకు మైలవరం రెస్టారెంట్లలో అమ్ముతున్నట్లు నింధితులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎవరైనా రెస్టారెంట్లకు వెల్లే ముందు ఒక సారి ఆలోచించండి.