Saturday, April 27, 2024
- Advertisement -

కృష్ణా జిల్లా..అభ్యర్థులు ఖరారు?

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ- జనసేన కూటమి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఎన్నికల రేసులో ముందు వరసులో ఉన్నారు జగన్. ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే సగానికి పైగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రటించారు జగన్. ఇక టీడీపీ లిస్ట్ మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే కొన్ని జిల్లాల్లో వైసీపీ, టీడీపీ -జనసేన కూటమి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కృష్ణా జిల్లా విషయానికొస్తే గుడివాడలో కొడాలి నాని – వెనిగండ్ల రాము మధ్య పోటీ ఖాయం కాగా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను(సిట్టింగ్ ఎమ్మెల్యే) – శ్రీరామ్‌ తాతయ్య, టీడీపీ , నందిగామ- మొండితోక జగన్మోహన్ రావు(సిట్టింగ్ ఎమ్మెల్యే) – తంగిరాల సౌమ్య (మాజీ ఎమ్మెల్యే) మధ్య పోటీ ఖాయమైంది. ఇక మైలవరం- సర్నాల తిరుపతిరావు(వైసీపీ) – వసంత కృష్ణప్రసాద్‌(సిట్టింగ్ ఎమ్మెల్యే-టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం) ఉండగా దేవినేని ఉమ సైతం ఆసక్తి చూపిస్తున్నారుజ

తిరువూరు- నల్లగట్ల స్వామిదాస్(టీడీపీ నుంచి వైసీపీలో చేరిక) – కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య పోరు జరిగే అవకాశం ఉండగా నూజివీడు- మేక ప్రతాప్ అప్పారావు(సిట్టింగ్ ఎమ్మెల్యే) – కొలుసు పార్ధసారథి (పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే)టీడీపీ తరపున బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ – యార్లగడ్డ వెంకటరావు (టీడీపీ) పోటీ జరగనుంది.

మచిలీపట్నంలో-పేర్ని కృష్ణమూర్తి – కొల్లు రవీంద్ర మధ్య, అవనిగడ్డ- సింహాద్రి చంద్రశేఖర్ – మండలి బుద్ధప్రసాద్‌, పామర్రు- కైలే అనిల్ కుమార్ – వర్ల కుమార్‌రాజా,పెనమలూరు- జోగి రమేష్ – దేవినేని ఉమా,పెడన- ఉప్పాల రాము – కాగిత కృష్ణప్రసాద్‌,విజయవాడ ఈస్ట్- దేవినేని అవినాష్ – గద్దె రామ్మోహన్‌, విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస్ – బొండా ఉమామహేశ్వర్‌రావు, విజయవాడ వెస్ట్ -ఎస్ కె ఆసిఫ్ – పోతిన మహేశ్‌ (జనసేన) మధ్య పోటీ జరగనుంది. ఈ జిల్లాలో ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ పోటీ చేసే స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -