సాదారనంగా తప్పు చేసిన వ్యక్తులు జైలు శిక్ష అనుభవించటం ఇప్పటి వరకు మనం చూశాం. ఇది ఎక్కడైనా సర్వసాదారనం. కాని ఉత్తర ప్రదేశ్ జలన్ జిల్లా ఉరై జైలులో ఓ విడ్డూరం జరిగింది. పోలీసులు అత్యుత్సాహం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ విడ్డూరం వింటె ఎవరైనా ముక్కుమీద వేలేసుకోవాల్సిందె.
గాడిదలు తప్పు చేశాయంటూ జైలులో పెట్టారు అధికారులు. ఇంతకీ ఆ ఎనిమిది గాడిదలు చేసిన పెద్ద తప్పేమిటో తెలుసా? జైలు కాంపౌండ్‌లో ఉన్న ఖరీదైన మొక్కల్ని నాశనం చేయడమే. వీటి విలువ లక్షల్లో ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ గాడిదలు జైలు ఆవరణలోకి ప్రవేశించి ఖరీదైన మొక్కలను తిన్నాయన్న అభియోగాలపై, విచారించిన జులాన్ జిల్లా కోర్టు, నాలుగు రోజుల జైలు శిక్షను విధించగా, ఆ శిక్షను అమలు అధికారులు అమలు చేశారు. తమ సీనియర్ అధికారి జైలుకి లోపల ఏర్పాటుచేసిన ఖరీదైన మొక్కలను ఈ గాడిదలు నాశనం చేశాయంటూ హెడ్ కానిస్టేబుల్ ఆర్‌కే మిశ్రా చెప్పారు.
జైలు ఆవరణలోకి వస్తున్న గాడిదలు, మొక్కలను తింటున్నాయని, వాటిని జైలులోకి తోలవద్దని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే ఫిర్యాదు చేశామని తెలిపారు. గాడిదలను వదులుకోవాల్సి వస్తుందంటూ పలు మార్లు ఓనర్‌ను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, దీంతో వీటిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ గాడిదలను జైలు నుంచి బయటికి విడిపించడానికి ఓ స్థానిక రాజకీయ నాయకుడు బెయిల్ మొత్తాన్ని చెల్లించాడు
బెయిల్‌కు కావాల్సిన నగదు కట్టడంతో జైలు అధికారులు ఆ గాడిదలకు విముక్తి కల్పించారు. తమ గాడిదలు జైలు నుంచి విడుదలవుతున్నాయని ఇక్కడికి వచ్చానని, నాలుగు రోజుల పాటు తమ ఎనిమిది గాడిదలు జైలులోనే ఉన్నట్టు వాటి యజమాని కామ్‌లేష్ తెలిపారు.