ప్రేమ గాలి లాంటిది, అది లేకపోతే శ్వాసించ లేము ! ప్రేమ నీరు లాంటిది, అది లేకపోతే జీవించ లేము ! ప్రేమ అవని లాంటిది, ఆధారంగా లేకపోతే నిలబడ లేము ! ప్రేమ ఆకాశం లాంటిది, ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది అని ఓ కవి రాసుకొచ్చారు. అలాంటి ప్రేమను తాము ఇష్ట పడిన వారికి వ్యక్తం చేయడానికి ప్రతియేటా వచ్చే ప్రేమికల రోజు కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అదే వాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు రానే వచ్చింది..!
అయితే, సంవత్సరంలో ఎన్నో రోజులు ఉండగా.. ఫిబ్రవరి 14 నే ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? వాలంటైన్, ప‌్రేమికుల రోజు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..! వాలంటైన్ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువ నమ్మేది.. వాలంటైన్ ఒక మత ప్రవక్త. మూడో శాతాబ్దంలో రోమ్ నగరాన్ని పాలిస్తున్న రెండో క్లాడియస్ కాలంలో నివసించాడు. అయితే, రోమ్ చక్రవర్తి మగవాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరంటూ వివాహాలను నిషేధించాడు.

ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లదంగా, ఆనందంగా ఉంటుందని నమ్మే వాలంటైన్‌కు పెళ్లిళ్ల నిషేధం నచ్చకపోవడంతో.. యువతి యువకులకు ప్రేమోపదేశాలు చేస్తూ.. రహస్యంగా వారి పెళ్లిళ్లు జరిపించడం చేశాడు. ఈ విషయం తెలిసిన రెండో క్లాడియస్ వాలంటైన్‌కు జైల్లో బంధించాడు. ఈ క్రమంలో వాలంటైన్ జైలర్ కూతురితో ప్రేమలో పడి.. ఓ లవ్ లెటర్ పంపాడు. దీంతో ఆగ్రహించిన చక్రవర్తి ఫిబ్రవరి 14న వాలంటైన్‌కు మరణ శిక్ష విధించాడు.
అలాగే, ఫిబ్రవరిలో రోమన్లు లుపర్ కాలియా అనే వేడుక జరుపుకుంటారు. దీనిలో భాగంగా వారి ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. దీనిలో భాగంగా వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఈ వేడుకను రోమన్ల సంప్రదాయంగా మార్చి.. వాలంటైన్ గుర్తుగా జరుపుకోవాలని భావించారు. ఫిబ్రవరి 14న చనిపోయిన వాలంటైన్ పేరు వాడటం మొదలు పెట్టారు. క్రమంగా ఇది వాలంటైన్స్ డే గా మారిపోంది. దీనిని తొలిసారిగా 496వ సంవత్సరంలో జరుపుకున్నారని కథలు ఉన్నాయి.
‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేపనున్నదీపిక !
సంతోషంతో పొంగిపోతున్న కాజల్.. అందుకేనట !