Thursday, March 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో.. హరితేజ.. బుర్రకథ..

- Advertisement -

గతవారం.. కత్తికార్తీక, ధనరాజ్.. బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ధీక్ష వచ్చిన కొత్తలో ప్రిన్స్.. ఆమెకి కిస్ పెట్టి.. షోకి ఫుల్ ఎనర్జీ ఇస్తే.. ఆ తర్వాత ముమైత్‌ఖాన్ నవదీప్‌కు డీప్ కిస్‌తో.. ఫుల్ ఎనర్జీ నింపింది. ఇక ఇటివలే ఓ ఎపిసోడ్ లో హరితేజ తన ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.

హౌస్‌ కెప్టెన్‌గా ఉన్న ఆమె టైటిల్ రేస్‌లో ముందు వరుసలో నిలుస్తోంది. ఎప్పటిలాగే బిగ్ బాస్ ‘ఒప్పో రిక్షావాలా జిందాబాద్’ అనే హుషారైన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో స్టాండింగ్‌లో ఉన్న రిక్షా తొక్కుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తుచేసుకోవాలన్నారు. ఆప్రాంతాలకు సంబంధించిన చారిత్రక నేపథ్యాలను, జానపద గీతాలు, నృత్యాలను చేయాలని ఒక్కొక్కరూ రిక్షా తొక్కాలని, రిక్షాలో తప్పనిసరిగా 4 మంది సభ్యులు ఉండాలనేది కండిషన్. అయితే ఇందులో భాగంగా.. హరితేజ తన పాటలతో ఫుల్ ఫిదా చేసేసింది. హరితేజ హరిదాస్ అవతారంలో.. బిగ్‌బాస్ హౌస్‌ లో అందరికి షాక్ ఇచ్చింది.

ఇప్పటివరకు బిగ్ బాస్ లో జరిగిన విషయాలను.. బుర్రకథ రూపంలోకి.. చెప్పి.. అదరగొట్టింది. ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ చేసి.. కల్పన, మధుప్రియ, ధనరాజ్, శివబాలాజీ, కార్తీక, జ్యోతి ఇలా ఎవ్వరినీ వదలకుండా చెడుగుడు ఆడేసింది. దీంతో హరితేజ.. చెప్పిన కథకు.. హౌస్ మేట్స్ బుర్ర తిరిగింది. అయితే బిగ్ బాస్.. కి ఎన్టీఆర్ వచ్చినప్పుడు జోష్ కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారు.. స్టార్టింగ్లో పెద్దగా ఆలరించలేదని చెప్పాలి. అయితే హరితేజ మాత్రం స్టార్టింగ్ నుంచి పాటలు పాడుతూ.. జోక్ లు చేస్తూ.. బిగ్ బాస్ లో యాక్టివ్ గా ఉంది.

అందుకేనేమో ప్రేక్షకులు కూడా.. ఆమె ఎలిమినేట్ వరకు తీసుకరాలేదు. ఏది ఏమైన.. సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన హరితేజ.. బుల్లితెరపై.. నా షో నా ఇష్టంలో కనిపించింది. కానీ బిగ్ బాస్ లో హరితేజ చేసిన బుర్రకథ చూసాక.. ఆమెకు ఈ రెంజ్ లో టాలెంట్ ఉందని.. ఊహించలేదని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -