Wednesday, May 1, 2024
- Advertisement -

వీరి భ‌విష్య‌త్ చూపు వైసీపీ వైపేనా ….?

- Advertisement -

రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధినేత జ‌గ‌న్‌పై అన్ని వ‌ర్గానుంచి తీవ్రమైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నంద్యాల ఓట‌మి అనంత‌రం ఇప్పుడు పార్టీనుంచి నాయ‌కులు టీడీపీలోకి వెల్తున్నారనె వార్త‌లు జ‌గ‌న్‌ను తీవ్ర‌మైన ఒత్తిడికి లోనుచేస్తున్నాయి. మ‌రో వైపు రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి చెక్ పెట్టేందుకు రెడ్డి స‌మాజిక వ‌ర్గంతోనె చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. అయితే తాజాగా జ‌గ‌న్‌కు జేసీ బ్ర‌ద‌ర్స్‌ స‌పోర్ట్‌గా ఉంటార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి. దీంతో జేసీ బ్ర‌ద‌ర్స్ వైసీపీ వైపు చూస్తున్నారా…? మొన్నటి వరకూ జగన్ తనకు ఆగర్భశతృవైనట్లు వ్యవహరించిన జెసి తాజాగా జగన్ను బలమైన ప్రతిపక్ష నేతగా బహిరంగ వేదికపైనే అంగీకరించటమే అనుమానాలను బలపరుస్తోంది.

ఈ వ్యాఖ్య‌ల‌కు తోడు అనంతపురం ఎంపిగా పోటీ చేసే ఉద్దేశ్యంతోనే జెసి కొడుకు జగన్ తో మొదటి నుండి టచ్ లో ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని జెసి ఆమధ్య ప్రకటించారట. ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత అన్నది ప‌క్క‌న‌పెడితె …. జేసీ జగన్ను బలమైన ప్రతిపక్ష నేతగా బహిరంగంగా అంగీకరించటమేంటి? అన్న విషయంపైనే టిడిపిలో కుడా చర్చ మొదలైంది. అయితే జెసి వ్యాఖ్యల వెనుక కూడా ఏదో ప్లాన్ ఉందనే అనుమానాలు జోరందుకున్నాయ్.

జిల్లాలో చంద్రబాబునాయుడు సామాజికవర్గ ఆధిపత్యం నడుస్తోంది. దాన్ని జెసి సహించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టిడిపి నుండే జెసి కుంటుంబంలో ఎవరెక్కడ పోటీ చేసినా టిడిపి అభ్యర్ధులు, నేతల నుండి సహకారం అందేది అనుమానమే. దాంతో జెసిలో ఒకవిధమైన ఫ్రస్ట్రేషన్ మొదలై పార్టీలో ఇమడలేక ఉక్కిరిబిక్కిరవుతున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో త‌న‌కు కులపిచ్చి ఉందని చెప్పుకోవటం, జగన్ను బలమైన ప్రతిపక్షగా అంగీకరించటం వ్యూహాత్మకమేనంటున్నారు. ఒకవేళ జెసి సోదరులు టిడిపి నుండి బయటకు వచ్చేసినా వైసీపీలో చేరటం అంత సులభం కాద‌నేది వాస్త‌వం. తాడిపత్రి అసెంబ్లీ, అనంతపురం ఎంపి సీటులో పోటీ చేయటమే వారి లక్ష్యం. ఇప్ప‌టికే వైసీపీలో ఆ స్థ‌నాల్లో బ‌ల‌మైన నేత‌లు ఉన్నారు. పార్టీని న‌మ్ముకున్న‌నేత‌ల‌ను కాద‌ని జేసీ సోద‌రుల‌ను జ‌గ‌న్ స్వాగ‌తిస్తాడా అన్న‌ది సందేహ‌మే… ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పార్టీలో ఎలాంటి మార్పులైనా జ‌ర‌గొచ్చు. చూద్దాం..! భ‌విష్య‌త్తులో ఏంజ‌రుగ‌తుందో…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -