ప‌వ‌న్ ఇంటి ముందు ర‌చ్చ ర‌చ్చ‌చేసిన మ‌హిళ‌ ఎందుకు….?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న పేరు వింటే చాలు ఊగిపోయే అభిమానులు చాలామందే ఉంటారు. ప‌వ‌న్‌పై క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నె రేపాయి. దీంతో అభిమానులు క‌త్తి మ‌హేష్ మీద మాట‌ల దాడిని ప్రారంభించారు.

ఇప్పుడు అలాంటి విష‌యం ప‌క్క‌న‌పెడితె అభిమానం పిచ్చిగా మారి పీక్ స్టేజీకి వెలితె ఎలా ఉంటుందో అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్‌లోని ప‌వ‌న్ ఇంటి ద‌గ్గ‌రికి అప్పుడ‌ప్పుడు జ్యోతి అనె మ‌హిళా అభిమాని వ‌స్తుండె వారు. ప‌వ‌న్ అంటె ప్రాణం అని చెప్పుకొనె ఆ మ‌హిళ హిమాయత్ నగర్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది.

- Advertisement -

అయితే ఎన్నో సార్లు పవన్ ని చూడడం కోసం ఆయ‌న ఇంటికి వెళ్ళిన ఆమెకి పవన్ కళ్యాణ్ దర్శ‌న‌భాగ్యం క‌ల‌గ‌క‌పోవ‌డంతో చాలా నిరాశతో ఉండేది. గతరాత్రి పవన్ ఇంటి ముందు ఆమె హంగామా చేసింది. అర్ధరాత్రి దాటినా కూడా ఇంటికి వెళ్ళకుండా పవన్ ని చూస్తేనే కానీ వెళ్ళను అంటూ రోడ్డు మీద ధర్నా కి దిగి ర‌చ్చ ర‌చ్చ చేసింది . దీంతో పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వారు వచ్చి సదరు యువతిని స్టేషన్ కు తీసుకెళ్లారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -