- Advertisement -
కొబ్బరి పాలలో చర్మాన్ని మృదువుగా మార్చే కొవ్వులు,పోషకాలు,ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముడతలు లేని చర్మంతో మంచి మెరుపును అందిస్తుంది.
1. కొబ్బరి పాలలో దూదిని ముంచి ముఖానికి రాసి వేళ్ళతో వృత్తాకారంగా మసాజ్ చేయాలి. పావు గంట తర్వాత ఒక వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పిండి
ముఖాన్ని శుభ్రం చేయాలి.
2. కొబ్బరి పాలను స్నానానికి ముందు,ఆ తర్వాత రాస్తే మంచి బాడి లోషన్ గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
3. కొబ్బరి పాలను మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకల చిట్లిన చివరలు మాయం అవటమే కాక జుట్టు దృడంగా మారుతుంది.
4. స్నానం చేసే గోరువెచ్చని నీటిలో అరకప్పు కొబ్బరి పాలు,అరకప్పు రోజ్ వాటర్ వేసి పావుగంట అయ్యిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరిచుకుంటుంది.
