Saturday, May 11, 2024
- Advertisement -

జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించిన కోర్టు….

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్ట‌నున్న అన్న‌వ‌స్తున్నాడు పాద‌యాత్ర ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. పాద‌యాత్ర‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌ణ్ పెట్టుకున్న అభ్య‌ర్త‌న‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దీంతో జ‌గ‌న్‌కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు.

జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి పాద‌యాత్ర చేస్తాన‌ని విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందె. అయితె అప్ప‌టినుంచి ఆయ‌న చేయ‌ద‌లిచిన పాద‌యాత్ర‌పై అయోమ‌యం నెల‌కొంది. అక్ర‌మాస్తుల కేసులో విచార‌న‌ను ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ప్ర‌తీ శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌ర‌వ్వాల్సి ఉంది. పాద‌యాత్ర చేసె స‌మ‌యంలోఇలా గ్యాప్ ఇవ్వ‌డం వ‌ల్ల అంత‌రాయం ఏర్ప‌డుతుందిని వైసీపీ శ్రేణులు ముందునుంచి ఆందోళ‌న చెందుతున్నారు.

ఆరు నెల‌ల పాటు మిన‌హాయింపు ఇవ్వాల‌ని మొద‌ట హైకోర్టులో పిటిష‌న్ పెట్టుకున్నారు. అయితె హైకోర్టు సీబీఐ కోర్టులోనె తేల్చుకోవాల‌ని సూచించ‌డంతో సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. రెండు సార్లు వాద‌న‌లు విన్న కోర్టు జ‌గ‌న్‌కు షాక్ క‌లిగె తీర్పు ఇచ్చింది.

అక్క‌మాస్తుల కేసులో ప్ర‌తి శుక్ర‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌రు అవుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, తాను వ‌చ్చేనెల 2 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ వేసిన పిటిష‌న్‌పై కోర్టు ఈ రోజు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది.

కేసు విచారణలో ఉండగా ప్రధాన నిందితుడికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాలని జగన్ తరపు న్యాయవాదులు నిర్ణయించినట్లు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -