Sunday, May 5, 2024
- Advertisement -

పోలీస్ ఆఫీసర్ అని చేప్పి.. పెళ్ళి చేసుకున్న కిలాడీ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు

- Advertisement -

ఈమధ్య పోలీసులే కాదు.. పోలీసుల పేర్లు చెపుకుని కూడా చాలామంది తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. దీంతో ఆ వ్యవస్థపై జనాలలో గౌరవం పోతోంది. తాజాగా పోలీస్ కాకపోయినా పోలీస్ ఆఫీసర్ అని పేరు చెపుకుని కేరళలోని ఓ మగువ తన కిలాడి తనాన్ని చూపించుకుంది. చూడడానికి రబ్బరు బొమ్మలా ఉండే ఈ ఈ వనితేనా ఈ పని చేసిందని విషయం తెలిసాక అంతా ముక్కున వేలేసుకున్నారు.

విషయంలోకి దూకితే… కేరళలో అశ్రిత అనే కిలేడీ పోలీసులకు చిక్కింది. ఈవిడగారు తనను తాను ఐపీఎస్‌గా చెప్పుకుని… ఎయిర్‌ఫోర్స్ ఎంప్లాయ్ ని పెళ్లి చేసుకుంది. దీనికి ముందు కొలువు పెట్టిస్తానని చెప్పి ఒకతని దగ్గర డబ్బు తీసుకుంది . ఆ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… అసలు మ్యాటర్ వెలుగులోకొచ్చింది. కొట్టాయం జిల్లాకు చెందిన అఖిల్ మనోహర్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ… అశ్రిత అనే యువతి మాయలో పడి ప్రేమపాఠాలు వల్లె వేశాడు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌గా అశ్రిత(24) తనను తాను పరిచయం చేసుకుంది. దీంతో అతను ఈమెను వివాహం చేసుకున్నాడు.

వివాహమైన 38 రోజుల తర్వాత తన భార్య మోసకారి అని అఖిల్ మనోహర్‌ గుర్తించాడు. నిజానికి అశ్రిత సంతి అనే యువకుడి పొరుగింట్లో నివాసముండేది. అశ్రిత ఐపీఎస్ ఆఫీసర్ అని నమ్మిన సంతిని ఆమె మోసం చేసింది. తనకు డ్రైవర్ కమ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తానని చెప్పి 3లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆ డబ్బు తీసుకున్న తర్వాత బేబి…. పత్తా లేకుండా పోవడంతో సంతి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్రిత అప్పటికే.. అఖిల్ మనోహర్ అనే యువకుడిని పెళ్లి చేసుకుందని గుర్తించారు. ఇంతకీ అశ్రిత వీధి బడితో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి… ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -