నేటి రోజుల్ల్ స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి రోజు కూడా మన డైలీ దినచర్యలో మొబైల్ భాగమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మొబైల్ చేతిలో లేనిదే రోజు గడవని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు ప్రతీది కూడా మొబైల్ ద్వారానే చెల్లింపులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మొబైల్ లావాదేవీల విషయంలో క్యాష్ లెస్ పేమెంట్స్ విధానం అనగా ఈ యొక్క యూపీఐ ( UPI ) విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత గూగుల్ పే, పోన్ పే, పేటియం వంటి ద్వారానే నగదు లావాదేవీలు చేస్తూ ఉన్నాం. మనము ఎవరికైనా డబ్బులు పంపించాలన్న లేదా ఎవరైనా మనకు డబ్బులు పంపించాలన్న ఈ యాప్స్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని సార్లు మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లగానీ, లేదా యూపీఐ ( UPI ) నెంబర్ ను తప్పుగా ఎంటర్ చేయడం వల్లగానీ మనం పంపించే అమౌంట్ వేరే వాళ్ళకు వెళ్లిపోతుంది. అప్పుడు ఆ అమౌంట్ పొందిన వాళ్ళు మంచి వారైతే మన డబ్బు మనకి ఇచ్చేందుకు సిద్దపడతారు. కానీ కొందరు మన డబ్బు మనకు తిరిగి షేర్ చేయడానికి నిరాకరిస్తారు. అలాంటి సమయాల్లో మనం ఏ చేయలేని పరిస్థితి ఉండిపోతాము. అయితే కొన్ని పద్దతుల ద్వారా మనం పంపించిన డబ్బు మనం తిరిగి పొందే అవకాశం ఉంది. ఆ పద్దతులు ఎంతో ఒకసారి చూద్దాం !
- యూపీఐ అధికారిక సంస్థ కు చెందిన హెల్ప్ లైన్ నెంబర్స్ ( 1800 120 1740 , 02245414740 ) ఈ నెంబర్స్ కు కాల్ చేసి మన యూపీఐ కి సంబంధించిన డీటైల్స్ మరియు మనం తప్పుగా పంపించిన మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడి డీటైల్స్ ఇచ్చి.. మన డబ్బు మనం తిరిగి పొందే అవకాశం ఉంది.
- పై విధాగానే కాకుండా ఇలా కూడా చేసి మన డబ్బు మనం తిరిగి పొందవచ్చు.
ముందుగా మనం యూపీఐ లింక్ అయిన బ్యాంక్ దగ్గరకు వెళ్ళి మనం తప్పు నెంబర్ కు డబ్బులు పపించినట్లుగా బ్యాంక్ మేనేజర్ కు కాంప్లెయింట్ ఇవ్వాలి. అప్పుడు సదరు బ్యాంక్ మేనేజర్ మనం ఏ నెంబర్ కు అయితే డబ్బులు పంపించామో ఆ నెంబర్ కు సంబంధించిన వివరాలు అడుగుతాడు.ఆ వివరాలు ఇచ్చిన తరువాత మనం పంపించిన అమౌంట్ మనం తిరిగి పొందెలా బ్యాంక్ సహకరిస్తుంది. - పై రెండు విధాలుగా కాకుండా మరో పద్దతి ద్వారా కూడా మనం డబ్బును తిరిగిపొందవచ్చు. అదేలాగనగా.. ఆర్బీఐ కి అంబంధించిన అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ సెక్షన్ లోకి వెళ్ళి మన సమస్యనూ అక్కడ తెలియజేసి.. మన యుపిఐ నెంబర్ అలాగే మనం అమౌంట్ సెండ్ చేసిన మొబైల్ నెంబర్ లేదా యుపిఐ నెంబర్ ఇక్కడ ఇచ్చి మనం పంపించిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మొబైల్ ఫ్యాంట్ జోబిలో పెడుతున్నారా.. జాగ్రత్త !