Monday, April 29, 2024
- Advertisement -

లాప్ టాప్ ఓవర్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో.. ల్యాప్ టాప్ వాడకం కూడా దాదాపుగా అంతే స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఈ కరోనా తరువాత చాలమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో ల్యాప్ టాప్స్ యొక్క అవసరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ల్యాప్ టాప్ ను తరచూ వాడడం వల్ల సిస్టమ్ ఓవర్ హిట్ అవ్వడం లేదా హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా ల్యాప్ టాప్ ఓవర్ హీట్ అవ్వకుండా లేదా హ్యాంగ్ అవ్వకుండా జాగ్రత్త వహించవచ్చు. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో చూద్దాం.

1.బయాస్ అప్డేట్ చేయడం
చాలామంది ల్యాప్ టాప్ యొక్క బయాస్ ను అప్డేట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఇలా లాప్ టాప్ యొక్క బయాస్ ను అప్డేట్ చేయకపోవడం వల్ల సిస్టమ్ ర్యామ్ లోని జామ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా సీపీయూ అధిక ఒత్తిడికి గురై సిస్టమ్ ఓవర్ హిట్ అవుతుంది. అందువల్ల ఈ సమస్య కు చెక్ పెట్టాలంటే లాప్ టాప్ యొక్క బయాస్ సెట్టింగ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇలా అప్డేట్ చేయడం వల్ల ర్యామ్ పైన అలాగే సీపీయూ పైన ఒత్తిడి తగ్గి.. హిటింగ్ సమస్య తగ్గుతుంది.

2.అనవసర యాప్స్ ను డిలీట్ చేయడం
మనం లాప్ టాప్ ను వాడేటప్పుడు ఎన్నోఅప్లికేషన్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటాం. అలాగే క్రోమ్ ఎక్స్ టెంషన్స్, వివిధ రకాల ప్లగ్ ఇన్స్.. ఇలా చాలా వాటిని లాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేసి యూస్ చేస్తూ ఉంటాం. అయితే వాటి అవసరం తీరాక వాటిని డిలీట్ చేయడం మర్చిపోతూ ఉంటాం. దాంతో అవి బ్యాక్ గ్రాండ్ లో రన్ అవుతూ ఉండడం వల్ల.. సిస్టమ్ లో హిటింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల అవసరం లేని వాటిని డిలీట్ చేసి జంక్ ఫైల్స్ ను క్లియర్ చేయాలి. ఇలా చేయడం వల్ల లాప్ టాప్ లో హిటింగ్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు, సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

పాత మొబైల్ లోని డేటా.. కొత్త మొబైల్ లో పొందండిలా !

మీ మొబైల్ పోయిన వెంటనే.. తప్పక చేయవలసిన పనులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -