Thursday, May 2, 2024
- Advertisement -

ప‌సుపు పాల‌తో ప్ర‌యోజ‌నాలెన్నో !

- Advertisement -

పాలు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పోతే పసుపు కూడా యాంటీబయోటిక్. ఈ రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. మరి ఈ రెండింటిని కలిపి తాగితే.. వచ్చే ప్రయోజనాలేంటో చూసేద్దాం రండి.. నేడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా మందులను వాడేస్తున్నాం. తరచుగా అనేక రకాల మందుల వాడకం మూలంగా అనేక అనారోగ్య సమస్యలు రావొచ్చు.

అందుకే ఈజీగా అనేక రకాల రోగాలను నయం చేయడానికి పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి. దగ్గు, జలుబు, గొంతులో సమస్య ఉంటే మీరు చేయాల్సింది రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అరటీస్పూన్ పసుపు వేసి తాగాలి. కావాలంటే ఆ పాలలో చిటికెడు మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. పసులు యాంటీబయోటిక్ కాబట్టి ఇది శరీరంలో ఉండే వైరస్ లను, విషయ వ్యర్థాలను, క్రిములను నాశనం చేస్తుంది.

అందులోనూ రోగ నిరోధక శక్తిని పెంచడంలో పసుపు ముందుంటుంది. అందుకే పసుపును క్రమం తప్పకుండా వాడితే దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు. అలాగే ఆస్తమా సమస్య ఉన్న వారు ఈ పసుపు కలిపిన పాలను తాగితే.. శ్వాస బాగా ఆడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర లేమికి ఇది చక్కటి ఔషదం. అలాగే పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో ఈ పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి.

అమితాబ్, చిరు కాంభినేషన్ లో మ‌రో మూవీ !

అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -