అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వివిధ దేశాలపై టారీఫ్‌లు విధిస్తూ షాక్ ఇస్తుండగా అమెరికాలోని కోర్టుల్లో ట్రంప్‌కు కొన్నిసార్లు చుక్కెదురైన సందర్భాలున్నాయి.
ఈ క్రమంలో ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతలు వ్యాపించాయి. ఏకంగా ట్రంప్ డెడ్ అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారగా ట్రంప్ తన మనవడు, మనవరాలితో కలసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.దీంతో రూమర్స్‌కు చెక్ పడగా ఈ సమయంలో డాక్టర్లు ట్రంప్ హెల్త్‌పై షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
ట్రంప్‌కి ఉన్న సమస్య క్రిటికల్ వెనస్ ఇన్ ఎఫిషియన్సీ (సిరలు దెబ్బతినడం)…దీనిని మెడికల్ పరిభాషలో CVI అంటారు. దీనిపై అమెరికన్ డాక్టర్ మిమీ కాంగ్ స్పందించారు. ఓ హెల్త్ సెంటర్ బ్లాగ్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇది చిన్న సమస్యగా ఉంటుంది… అదే టైమ్‌లో తీవ్రంగానూ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే.. కాళ్లలో వాపు వస్తుంది. వాపు పెద్దదైతే తోలు మందం అవుతుంది. మంటలు పుడతాయి. చర్మం పొడిబారిపోతుంది. పరిస్థితి ఇంకా దిగజారితే ఆ కాలు లేదా చెయ్యి తీసేయాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పారు.
