ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ప్రయాణం ముగిసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా టీమ్ మేనేజ్‌మెంట్‌తో రాహుల్‌కు విభేదాలు ఉన్న నేపథ్యం, దీనికి తోడు గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో ద్రావిడ్‌ను తొలగిస్తారన్న వార్తలు రాగా అవి నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీనికి తోడు జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌తో ద్రావిడ్‌కు విభేదాలు సైతం ఓ కారణం అని తెలుస్తోంది. శాంసన్ గాయాలు, జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు ద్రావిడ్. ఈ క్రమంలోనే శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్ పేర్లను కెప్టెన్‌గా ప్రస్తావించడం వంటి అంశాలు ఓ కారణంగా భావిస్తున్నారు.
ఒక ఒకవేళ ద్రావిడ్ కోచ్ బాధ్యతల నుండి తప్పుకుంటే కుమార సంగక్కర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. లండన్‌లో త్వరలో జట్టు మేనేజ్‌మెంట్ సమావేశం కానుంది.ఈ సమావేశంలో ద్రావిడ్ ఎగ్జిట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
