తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా బీసీల రిజర్వేషన్లపై మంత్రికి అవగాహన లేదని గంగుల కమలాకర్ ఆరోపించారు.
గతంలో బిల్లు పెట్టినప్పుడు సంపూర్ణంగా సహకరించాం అన్నారు. అఖిలపక్షానికి తీసుకెళ్లాలని, శాస్త్రీయ పరంగా చేయాలని సూచించాం అనగా గంగుల కమలాకర్ కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.అపశకునాలు మాట్లాడకుండా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని… బీసీ కమిషన్ మాయమైపోయింది అంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని హితవు పలికారు పొన్నం.
50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాలు గుద్దిబండగా మారాయి అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చట్టాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకంగా మారింది… బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తే సంతోషమని గంగుల అంటున్నారు అన్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం కడపులో విషం పెట్టుకున్నట్లు గంగుల కామెంట్స్ ద్వారా స్పష్టమవుతోంది… రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది… రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు అన్నారు.
కల్వకుంట్ల అంటే ఎవరిని కలవనీయని కుటుంబం అని చురకలు అంటించారు రేవంత్. ఓసీ-బీసీలను కలవనీయరు,ఎవరిని కలవనీయకూడనిదే కల్వకుంట్ల ఫ్యామిలీ అని మండిపడ్డారు.
