Friday, May 17, 2024
- Advertisement -

ఫినాయిల్ అమ్మిన చమ్మక్ చంద్రకు జబర్ధస్త్ కమెడియన్ ఎలా అయ్యాడు..?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో వస్తుందంటే.. ఆ రోజు ఆ టైంకి ఎన్ని పనులు ఉన్న అన్ని అపేసి టీవీ ముందు కుర్చోవడమే. అయితే ఈ షో ఎంతో మంది కమెడియన్లకు ఎంతో సహయపడింది. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు నిపింది.

ఈ విషయంను జబర్ధస్త్ కమెడియన్లే చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్ధస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ రోడ్డుపైన ఫినాయిల్, యాసిడ్ అమ్ముతూ వచ్చారు. ఈ సంగతిని ఆయనే స్వయంగా చెబుతుంటారు. తన ఫ్యామిలీ మరింత హీన స్థితిలో ఉందని, ఫినాయిల్ అమ్మితేనే తాము నాలుగు ముద్దులు తినేవారమని చెబుతున్నారు చమ్మక్ చంద్ర.

తానెప్పుడు ఆ పని చేశానని బాధపడలేదని.. ఇప్పుడు తనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చరని సంతోషిస్తున్నానని చెబుతున్నారు చమ్మక్ చంద్ర. మొదటి నుంచి సినిమాలపై, నటన పై ఆసక్తి ఉన్న చంద్రకు జబర్ధస్త్ లో కామెడీ చేయాలని ఆఫర్ రావడంతో.. అలా జబర్ధస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మూవీలోను చంద్రకు మంచి చాన్సులు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -