Saturday, May 4, 2024
- Advertisement -

కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీని ప్రకటించిన ఉపేంద్ర….

- Advertisement -

సినిమారంగంలో పేరు,ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన హీరోలు రాజ‌కీయ పార్టీల‌ను ప్రారంభిస్తున్నారు. ఎమ్‌జీఆర్ నుంచి ఎన్‌టీరామారావు, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్ లు పార్టీల‌ను స్థాపించారు. క‌మ‌ల్‌హాసన్ కొత్త పార్టీని స్థాపించనున్న నేప‌థ్యంలో మ‌రో క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త పార్టీని ప్ర‌క‌టించారు.

తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా చేరువైన కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. బెంగళూరులో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ’ అని ఆయన తెలిపారు. పార్టీ లోగోను కూడా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని గాంధీభవన్ వేదికైంది.

పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం, పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా ఉపేంద్ర పేర్కొన్నారు. ఇది తన పార్టీ కాదని, ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని… తన లక్ష్యాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని చెప్పారు. రైతుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని… దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు.

నవంబర్‌ 10న పార్టీ వెబ్‌సైట్‌, యాప్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. సమాజాన్ని, రాష్ట్రాన్ని ఎలా మెరుగుపరచాలో తెలుపుతూ తమ ఆలోచనలతో ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వంతు సహకరించాలన్నారు. 2018 లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేపీజేపీ పార్టీ పోటీ చేయనుందని, ఈ ఎన్నికలకు కేవలం ఆరు నెలలే సమయం ఉందన్నారు. మనం గెలవకపోవచ్చు కానీ మార్పు తీసుకురావడం మనం ప్రధాన ధ్యేయమని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -