- Advertisement -

ఓరి దేవుడోయ్…….. అబద్ధాలు చెప్పడంలో బాబు అండ్ కోని దాటేసిన పవన్…… ఇండియాలో నంః 1

- Advertisement -

వామ్మో…….. ఓరి దేవుడోయ్……. ఈయనా నిజాయితీపరుడు? ఈ స్థాయిలో అబద్ధాలు చంద్రబాబు కూడా చెప్పలేడేమో? దేశంలోనే నంబర్ ఒన్ అబద్ధాల కోరు రికార్డ్ కచ్చితంగా పవన్‌దే. మూఢాభిమానులు ఎవ్వరూ ఆవేశపడాల్సిన అవసరం లేదు. పవన్ చెప్పిన అబద్ధాలు…..అసలు నిజాలు ఇవిగో. ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలరా?
1. సిఎం కావాలంటే అనుభవం ఉండాలి. అది లేదు కాబట్టే జగన్‌కి మద్ధతివ్వలేదు
……….డైలాగ్ అదిరింది. మరి నీ అన్నయ్య చిరంజీవి ముఖ్యమంత్రి అవుతానంటే ఎందుకు మద్ధతిచ్చావ్? ఊరూరూ తిరిగి ఎందుకు ప్రచారం చేశావ్? నారా లోకేష్ కేబినెట్ మంత్రి అయితే ఎందుకు మాట్లాడలేదు? ఎప్పటికెయ్యది అప్పటి మాటలు ఆడేవాడిని ఏమంటారో నువ్వే చెప్పాలి.

2. జగన్ అవినీతిపరుడు.కాబట్టే మద్ధతివ్వలేదు…….
…………….క్యా డైలాగ్ హై………చిరంజీవి పార్టీ సీట్లు అమ్ముకోవడం అవినీతి కాదా? 2009 ఎన్నికల సమయంలో చెన్నైల మీ బంధువుల ఇంట్టో యాభై కోట్లకు పైగా దొరికిన సొమ్మును ఏమంటారు? సినిమాకు నువ్వు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? వైట్ ఎంత? బ్లాక్ ఎంత? దమ్ముంటే లెక్కలు చెప్పగలవా? ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్ డ్ మీ’ అని చెప్పి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏరకంగా నీతిపరుడయ్యాడు? 2009 ఎన్నికల్లో ఇదే చంద్రబాబుని అత్యంత అవినీతిపరుడు అని తమరే అన్నారు? మరి అదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో మీకు నీతిపరుడిగా ఎలా కనిపంచాడు? భారతదేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని నీకు తెలుసా? ఇక్కడ మళ్ళీ జగన్ పెద్ద అవినీతిపరుడు…చంద్రబాబు చిన్న అవినీతిపరుడు……చిరంజీవి ఇంకా చిన్న అవినీతిపరుడు….నేను అందరికంటే తక్కువ అవినీతిపరుడు లాంటి సొల్లు కబుర్లు వద్దు. అవినీతి పరులా? కాదా? అన్న విషయం చెప్పు. నీకు ధైర్యం ఉంటే ఓటుకు కోట్లు కేసు గురించి మాట్లాడి చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చెప్పగలవా? దమ్ము, ధైర్యం ఉన్నాయా?

3. సిఎం అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పవా? అధికార దాహం లేదా?
………….ఇలాంటి మాటలు వద్దు కానీ జగన్‌కి నీకూ తేడా ఏంటంటే జగన్ డైరెక్ట్‌గా యుద్ధంలో తలపడుతున్నాడు. ముఖ్యమంత్రి అయి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్తున్నాడు. నీకు కనీసం యుద్ధంలో తలపడే ధైర్యం లేదు. నీ అన్న చిరంజీవి కూడా సేం టు సేం. పోరాడటం చేతకాక పార్టీని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే. ఈ విషయాన్ని నువ్వు తప్పుగా చెప్పావ్. కరెక్ట్‌గా ఏమని చెప్పాలంటే………..2009 నుంచి రాజకీయాల్లో ఉన్నావ్……..ప్రజలకు ఏం ఒరగబెట్టావ్ అంటే ఏమీ చెప్పలేవ్. కానీ నువ్వు నష్టపోయింది మాత్రం ఏమీ లేదు. నీ పాటికి నువ్వు సినిమాలు చేసుకుంటున్నావ్…….సంపాదించుకుంటున్నావ్…..షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు…..సినిమా గ్యాప్‌లో ప్రజల కోసం ఓ రెండు రోజులు కేటాయిస్తున్నావ్……నీ సొమ్మేం పోయింది……నీకు అవకాశం వచ్చేవరకూ ఇలాంటి రాజకీయం చేస్తూనే ఉంటావ్…….అవకాశం వచ్చిన రోజు కుర్చీ ఎక్కేద్దామన్నది ప్లాన్. ఈ గ్యాప్‌లో నీకు రావాల్సినవి వస్తూనే ఉన్నాయిగా. ఒక్క విషయం ఆలోచించుకో పవన్. జగన్‌లాంటి ప్రజాదరణ ఉన్న ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా ప్రజలను పట్టించుకుని ఉండేది కాదు. అలాగే నీకు ఈ స్థాయి ప్రాముఖ్యత అస్సలు దక్కి ఉండేది కాదు. కాదనగలరా?

4. ప్రజలకు నష్టం కలిగించే పార్టీలకు మద్ధతు ఇవ్వబోను……
………..నీకు ఈ డైలాగ్ చెప్పే అర్హత ఉందా పవన్? నువ్వు మద్ధతిచ్చిన మోడీ సీమాంద్రులను నిలువునా ముంచిన విషయం నీకు తెలియదా? ఇక చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రజలకు వెన్నుపోటు పొడిచాడో తెలియదా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే నాదీ బాధ్యత అంటావ్. ప్రజలను మోసం చేసే పార్టీలకు మద్ధతివ్వనంటావ్. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా మోసం చేయడం ప్రజలకు నష్టం చేయడం కాదా?

పవన్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధం. అంతా రాజకీయ నటనా లౌక్యం. జగన్‌కి నష్టం చేయడం…..బాబుకు పరోక్షంగా భజన చేయడమే పవన్ రాజకీయ సిద్ధాంతం. ఈ విషయం తెలుసుకోవడానికి పెద్ద జ్ఙానం అక్కర్లేదు. ‘జెండా పీకేద్దాం….’ అని చెప్పి చిరంజీవి పార్టీని సర్వనాశనం చేసేవరకూ చిరంజీవిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బాబు భజన మీడియా పవన్‌కి ఎందుకు అంతులేని ప్రాధాన్యత ఇస్తోంది? ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తుంటే కనీస స్థాయిలో కూడా వార్త కనపడదు. అదే పవన్ విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్ విషయంలో సాక్షి పత్రిక ఏ స్థాయిలో హడావిడి చే్స్తుందో అంతకుమించి చేస్తోంది ఎల్లో మీడియా. ఎందుకు? సాక్షి అంటే జగన్ సొంత మీడియా సంస్థ. అఫ్కోర్స్ ఎల్లో మీడియా కూడా చంద్రబాబు సొంతమే అనుకోండి. కాకపోతే జగన్‌కి ఏదైనా డైరెక్ట్‌గా చేయడం అలవాటు. చంద్రబాబుది ఎప్పుడూ వెన్నుపోటు సిద్ధాంతం. అంతా కూడా తెరవెనుక వ్యవహరాం. అలాంటి బాబు భజన మీడియా పవన్‌కి ఎందుకు ప్రాధాన్యతనిస్తోంది? మూడున్నరేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న తప్పులపై ఒక్కసారి ‘పంచెటూడగొట్టండి’ అంటూ కాంగ్రెస్ నాయకులపై చేసిన స్థాయిలో విమర్శలు చేయమనండి. ఆ తర్వాత నుంచీ చిరంజీవికి చూపించిన మ్యూజిక్‌ని పవన్‌కి కూడా చూపించకపోతే అడగండి. కానీ పవన్ అలా విమర్శించడు. ఎందుకంటే తెరవెనుక వ్యవహరాలు మహత్యం. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -