Thursday, April 18, 2024
- Advertisement -

ఏం మాట్లాడుతున్నావు పవన్? సమస్యను పరిష్కరిస్తున్నావా? చల్లారుస్తున్నావా?

- Advertisement -

మదర్ థెరిస్సా బొమ్మ పెట్టుకుని చేసిందంతా షోనేనా? ఎవరైనా బాధపడుతున్న వార్తలు పేపర్‌లో చదివితే రెండు మూడు రోజులు నిద్రపట్టదని చెప్పిన మాటలు అసత్యాలేనా? అసలు ఏం మాట్లాడుతున్నావ్ పవన్? ఏం స్పందిస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? మనుషులో దున్నపోతులో తెలియని టిడిపి నేతలు ఒక దళిత మహిళ విషయంలో దారుణంగా ప్రవర్తించారు. ఫొటోలు చూసినవాళ్ళకు కూడా గుండెతరుక్కుపోతోంది. అధికార మదం ఏ స్థాయిలో ఉంటే ఇలా చేస్తారు? ఆయనొస్తే బాగుంటుంది అని ఎన్నికల సమయంలో ప్రకటనలతో ఊదరగొట్టారుగా…….నువ్వు కూడా ఆయన్నే గెలిపించమని చెప్పావుగా? ఇప్పుడు చూడు……. ఒక దళిత మహిళను బహిరంగంగా వివస్త్రను చేస్తే కనీస స్థాయిలో స్పందించలేదు ఆయన. ఇకపై స్పందిస్తాడన్న నమ్మకం కూడా లేదు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా ఆ దున్నపోతులకే సపోర్ట్ చేస్తున్నారు.

కానీ నువ్వు మాత్రం సంయమనం పాటించండి. మీడియా సంచలనం చెయ్యొద్దు. టిడిపి నేతలో కాదో నాకు తెలియదు. ఈ వివాదం విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాలి. రెచ్చగొట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి………ఇవా నువ్వు చెప్పాల్సిన మాటలు? సమస్యను చల్లార్చడానికి మాట్లాడుతున్నట్టుంది కానీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉందా? టిడిపి నేతలు తప్పు చేస్తే చంద్రబాబు శిక్షిస్తాడని నువ్వు ఎలా నమ్ముతున్నావు పవన్? ఈ మూడున్నరేళ్ళ కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా? జేసీలు స్థానిక ఎస్ఐని ఏ స్థాయిలో దుర్ఫాషలాడారో నువ్వు టివి చానల్స్‌లో, పేపర్స్‌లో వార్తలు చూడలేదా? చంద్రబాబు శిక్షించాడా? వనజాక్షి విషయంలో చంద్రబాబు ఎలా స్పందించాడు? పుష్కర ప్రమాదంలో 30మంది చనిపోయినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పావ్.

ఒక మహిళను అధికార పార్టీ నేతలు బహిరంగంగా వివస్త్రను చేసి అవమానిస్తే అది వార్త అవకూడదా? ఆ వార్తను సంచలనం చేయకూడదా? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకూడదా? ఇదే పని వైకాపా జనాలు చేసి ఉంటే నీ స్పందన ఇలాగే ఉండేదా?

ఇప్పటి నీ స్పందన మళ్ళీ ఒకసారి చూసుకో పవన్…… నీ మానవత్వం డైలాగుల వీడియోలు కూడా చూసుకో…… టిడిపి నేతల దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎంతలా దిగజారిపోతున్నావో నీకే అర్థమవుతుంది.

https://www.youtube.com/watch?v=hh089YBjSHI

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -