Wednesday, May 8, 2024
- Advertisement -

రోహిత్ హిట్టింగ్‌కు కార‌నం అదేనా….

- Advertisement -

ఇండోర్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన 2nd టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. మొద‌టి వ‌న్డేలో దారునంగా విఫ‌లం అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెండో మ్యాచ్‌లో వీర విహారం చేశారు. ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా రోహిత్ కూడా సరిగ్గా 35 బంతుల్లోనే కెరీర్‌లో రెండో టీ20 శతకాన్ని అందుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రోహిత్ మాట్లాడారు. శ్రీలంక ఫీల్డింగ్ వ్యూహాల్ని దెబ్బతీసేందుకే తాను భీకరంగా హిట్టింగ్ చేసినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (118: 43 బంతుల్లో 12×4, 10×6) మెరుపు శతకంతో టీ20‌లో వేగవంతమైన సెంచరీ రికార్డుని సమం చేసిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌లో ఆరు ఓవర్లు (పవర్‌ ప్లే) తర్వాత ఫీల్డర్లు 30 అడుగుల సర్కిల్ నుంచి దూరంగా వెళ్తారు. దీంతో బౌండరీల కొట్ట‌డం కష్టమవుతుంది కాబట్టి.. ఫీల్డర్ల మధ్యలో ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా..? అని అన్వేషిస్తా. ఇందులో భాగంగానే మైదానం నలువైపులా ముందు షాట్లు.. ప్రత్యర్థి ఫీల్డింగ్ వ్యూహాలను చెదరగొట్టాలనేది నా ఆలోచన‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -