Friday, May 17, 2024
- Advertisement -

నోరు జారిన కత్తి… బూతు స్థాయికి దించిన ఆది… రుణం తీర్చుకున్న టీవి9

- Advertisement -

మిగతా జనాల కంటే కూడా విమర్శకుడు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమర్శలను భరించలేని స్థాయికి పాలకులు, ప్రతిభ ఉంది అనుకునేవాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. మామూలుగా అయితే ప్రతిభ ఉన్నవాళ్ళు ఎవరైనా విమర్శలను, విమర్శకులను సహృదయంతో తీసుకోవాలి. ఆ విమర్శల్లో పస ఉంటే వాళ్ళ ప్రతిభకు ఇంకాస్త సానపెట్టాలి. విమర్శల్లో పస లేదు అనుకుంటే లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ప్రతిభ ఉన్నవాడి ఇమేజ్‌ని విమర్శలు తగ్గించలేవు అన్నది వాస్తవం. నెగిటివ్ రివ్యూస్ వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇండియన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి-2 సినిమానే అందుకు ప్రబల సాక్ష్యం. గొప్ప కథ, హృదయాన్ని టచ్ చేసేలా లేదు అన్ని విమర్శకుల మాటలు నిజమే. కానీ సినిమా ఎంటర్టైన్ చేసినా కూడా కాసుల వర్షం కురిపిస్తాం అన్న కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాకు పట్టం కట్టారు. సినిమా తీయడంతో రాజమౌళి చూపించిన ప్రతిభకంటే పబ్లిసిటీ విషయంలో రాజమౌళి చూపించిన ప్రతిభ బాహుబలి సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించడానికి ఎక్కువ ఉపయోగపడింది.రాజమౌళి ప్రచార ప్రతిభ ముందు నెగిటివ్ రివ్యూల ప్రచారం దూదిపింజలా తేలిపోయింది. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్, మహేష్ అందం, బన్నీ డ్యాన్స్‌లులాంటి విషయాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయా హీరోలు కూడా పట్టించుకోరు. ఎటొచ్చీ కేవలం కామెడీ పండించడంలో మాత్రమే కాస్త ఎక్కువ ప్రతిభ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచీ కూడా సినిమాలలో యాక్టింగ్ కంటే కూడా బయట ఎక్కువగా నటించి త్రివిక్రమ్, బండ్ల గణేష్ లాంటి భజనపరుల పుణ్యమాని దేవుడైపోయాడు… దేవుడనిపించుకున్నాడు.

అక్కడే వచ్చింది సమస్య. యాక్టింగ్, డ్యాన్సులు లాంటివేవీ తనకు రావని పవనే చెప్పాడు. అది నిజం కూడా. దశాబ్ధంపైగా కలిసి ఉన్న రేణూదేశాయ్‌తో విడిపోయిన తర్వాత నెలా…రెండు నెలల వ్యవధిలోనే మూడో పెళ్ళి చేసుకున్న పవన్ వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయం ప్రశ్నార్థకం. ఎందుకంటే టైం పాస్‌కి కాలేజీలో లవ్ చేసే కుర్రాళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్‌కి దూరమైన వెంటనే ఇంకో అమ్మాయిని ప్రేమించడానికి రెడీ అయిపోరు. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోదు కాబట్టి. ఇక జగన్ ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో నా భార్య క్రిష్టియన్, నా కూతురు క్రిష్టియన్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం, ఇప్పుడు సినిమా స్టిల్స్‌లో కూడా జీసస్‌ బొమ్మను చూపించుకోవడం లాంటివి చూస్తుంటే కులం, మతాలకు అతీతుడ్ని అని పవన్ చెప్పుకునే మాటలు అస్సలు నమ్మలేం. ఇలాంటి రెగ్యులర్, రొటీన్ పొలిటకల్ డ్రామాలనే మహేష్ కత్తి ప్రశ్నించాడు. పవన్ నిజాయితీని నిలదీశాడు. బండారం బయటపడేశాడు. చాలా మంది ఆలోచనాపరులకు కనెక్ట్ అయ్యాడు. మహేష్ కత్తి విమర్శలను ద్వేషంతో పోల్చి పవన్ కూడా చాలా దిగజారాడు. పవన్ ఫ్యాన్స్ అంతకు పదిరెట్టు చేశారు.

అయితే తాజాగా మహేష్ కత్తి చేసిన ఒకే ఒక్క తప్పిదం పుణ్యమాని పవన్ ఫ్యాన్స్‌కి, పవన్ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్న టివి9కి అడ్డంగా దొరికేశాడు. తన ఫేస్ బుక్‌లో మహేష్ కత్తి పోస్ట్ చేసిన బూతు పదాలను కానీ, పవన్ ఫ్యాన్స్‌ని వెధవలు అని అనడాన్ని కాని ఎవ్వరూ క్షమించరు. ఆ విషయంలో మహేష్ కత్తిని కార్నర్ చెయ్యొచ్చన్న లక్ష్యంతోనే టివి9 వారు హైపర్ ఆదిని రంగంలోకి దించారు. జబర్ధస్త్ టీం అందరిలోకి అత్యంత ఎక్కువగా బూతులపైన ఆధారపడే టీం లీడర్ హైపర్ ఆదినే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్థాయి ఆర్గ్యుమెంట్స్‌తో తన స్థాయికి మహేష్ కత్తిని తగ్గించడంలో, క్రిటిక్‌గా కొంతమంది మేధావుల మన్నన కూడా పొందిన మహేష్ కత్తిని కూడా ఆవేశపరుడిగా, ఆలోచన లేకుండా మాట్లాడేవాడిగా, కేవలం క్రేజ్ కోసం వార్తల్లో ఉండేవాడిగా మహేష్ కత్తిని దిగజార్చడానికి హైపర్ ఆది చాలానే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో హైపర్ ఆదికి పోయేదేమీ లేదు. హైపర్ ఆది బూతు జోకులు చూసిన అందరికీ కూడా ఆది స్థాయి ఎంతో ఇట్టే తెలిసిపోతుంది. అవకాశమిచ్చిన నాగబాబు రుణం కూడా ఆ రకంగా తీర్చుకున్నాడు హైపర్ ఆది. ఇక కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ వేదికపైకి పిలిచి మరీ టివి9 అధినేతను పవన్ ప్రశంసించిన నేపథ్యంలో టివి9 కూడా పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకుంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌తో జనాలకు ఉపయోగపడేది ఏమీ లేదు కానీ ప్రతిభ లేకుండా హైప్ తెచ్చుకుని అద్దాల మేడల్లో ఉన్నవాళ్ళను విమర్శించే వాళ్ళు మాత్రం మరికాస్త జాగ్రత్తగా లేకపోతే ఆలోచనలేని వాళ్ళే అందలమెక్కేస్తారు అన్న నిజాన్ని మాత్రం ససాక్ష్యంగా నిరూపించింది ఈ టివి9 వారి హైపర్ ఆది హైపర్ డిబేట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -