Sunday, May 11, 2025
- Advertisement -

కిరాక్ ఆర్పీ భార్య గురించి ఎవరికి తెలియని నిజాలు

- Advertisement -

ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో మంది నటులకు మంచి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది నటులు మన తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. అంతేకాదు తమ కెరియర్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఈ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిరాక్ ఆర్పీ.

ఇతను టీం మెంబర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టీం లీడర్ గా ఎదిగి అందర్నీ నవ్విస్తాడు. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అదిరింది షోలో చేస్తున్నాడు. కిరాక్ ఆర్పీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతో ఆశతో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తను అనుకున్న దారిలో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. కిరాక్ ఆర్పీకి ఈ మధ్యనే పెళ్లి జరిగింది. అది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు లక్కీ. తనది నెల్లూరు.

తను నెల్లూరు లోకల్ ఛానల్ లో యాంకరింగ్ తో పాటు ప్రైవేటు షోను కూడా హోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఆర్పి తన భార్య లక్కీ ఇద్దరూ కలిసి కిరాక్ ఆర్పి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ ఆఫీస్ ని యాంకర్ రష్మి గౌతమ్ చేతుల మీదుగా ఓపెన్ చేయించారు ఆర్పి దంపతులు. లక్కీకి ఇవెంట్స్ అంటే ఇష్టం ఉండడంతో ఆమె ఫ్యాషన్ ను గుర్తించి తనకి సపోర్ట్ అందిస్తున్నాడు ఆర్పి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -