కాలంలో పాటు సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మన నిత్య జీవన శైలీలోనూ ఈనేక మార్పులు చోటుచేకున్నాయి. ఈ ఉరుకుల పరుగులు జీవితంలో పనిఒత్తిడి, బిజీ లైఫ్ కారణంగా మీరు సరిగ్గా నిద్ర పోవడం లేదా? మీ శరీరానికి తగినంతగా విశ్రాంతిని ఇవ్వడం లేదా? అయితే మీరు కోరికోరి అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టేనిని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సరైన నిద్ర లేకపోవడంతో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా రాత్రిపూట సరైంనంత నిద్ర శరీరానికి అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సరిగ్గా నిద్ర, విశ్రాంతి లేకపోవడం వల్ల మన శరీరం ముఖ్యంగా మెదడు పనితీరు దారుణంగా మారుతుందని తెలిపారు. దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశముందని హెచ్చిరిస్తున్నారు. సరైన నిద్రలేకపోవడంతో రక్తపోటు అధికమవుతుంది.
శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల సమతుత్యత దెబ్బతింటుంది. దీని కారణంగా వివిధ అవయవాలు పనితీరు దెబ్బతింటుంది. మెదడుపై ప్రభావం చూపి.. అనేక రకాక మానసిక రుగ్మతలు వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. దీని కారణంగా బ్యాక్టిరియా, వైరస్ ల ద్వారా సంక్రమణ చెందే వివిధ రకాల అంటూ వ్యాధులు త్వరగ సోకే అవకాశముంటుంది. కాబట్టి శరీరానికి సరైన విశ్రాంతి, నిద్రను (రోజులో దాదాపు 7 గంటలు నిద్ర) అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర రాకపోవడం వంటి సమస్యలు ఉంటే ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకుండా వైద్యలను సంప్రదించడం మంచిదని పేర్కొంటున్నారు.
‘ఉప్పెన’ బ్యూటీతో యంగ్ టైగర్ రోమాన్స్ !
ఉదయభాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటి ?
అరటాకులో భోజనం ఎందుకు మంచిదో తెలుసా?