Saturday, April 27, 2024
- Advertisement -

అర‌టాకులో భోజ‌నం ఎందుకు మంచిదో తెలుసా?

- Advertisement -

కాలంతో పాటు ఎన్నో మార్చే మ‌నిషి.. తినే ఆహార విష‌యంలో కొన్ని క‌ట్టుబాటుల‌ను న‌మ్ముతూ వ‌స్తున్నాడు. అయితే ఈ క‌ట్టుబాటుల వేనుకాల కూడా ఎంతో సైన్స్ దాగి ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయి. అయితే అలాంటి క‌ట్టుబాటుల్లో అర‌టాకు భోజ‌నం కూడా ఒక‌టి. దీని ప్లేస్ లో నేడు ప్లాస్టిక్ ప్లేట్లు వ‌చ్చినా కానీ.. ఆ అర‌టాకులు ఇచ్చే సంతృప్తిని ఈ ప్లేట్లు ఇవ్వవు.

అరటి ఆకులో భోజనం అనాదిగా వ‌స్తున్న మ‌న ఆచారం. అయితే దానికి కార‌ణాలు చాలానే ఉన్నాయి. ఆక‌లి అని అన్నవాడు శత్రువయినా సరే అన్నం పెట్టే సాంప్రదాయం మ‌న‌ది. అలా శత్రువుకి అన్నం పెట్టే సమయంలో అవ‌త‌లివాడికి అన్నంలో విషం పెట్టి చంపుతారేమో అనే అనుమానం స‌హ‌జంగానే ఉంటుంది కాదా..?

అయితే విషం అర‌టాకు మీద ప‌డితే.. ఆకు అప్పుడే న‌ల్లగా మారిపోతుంది. అందుకే వాడికి న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డానికి ఈ ఆకును ఎంచుకున్నార‌ట‌. అలాగే వేడి వేడి పదార్ధాలను అర‌టాకులో వడ్డిస్తే దాని మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంద‌ట‌. దాంతో భోజ‌నానికి ఎంతో రుచి వ‌స్తుంద‌ట‌. అలాగే తిన్నది కూడా సులభంగా జీర్ణ మయ్యే శక్తిని ఇస్తుంద‌ట‌. ఇలా ఎన్నో లాభాలు ఉన్న అర‌టాకులో మీకు వీలున్న‌ప్పుడైనా తిన‌డం ఎంతో మంచిది.

ఇద్ద‌ర‌మ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ స‌భ్యులు!

ప్రియాంక‌పై క‌న్నేసిన స‌లార్ డైరెక్ట‌ర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -