Thursday, May 2, 2024
- Advertisement -

మహానాడు సాక్షిగా జగన్ సూపర్ హీరో అని ఒప్పుకున్నారుగా..

- Advertisement -

మహానాడులో టిడిపి నేతల ప్రసంగాలను పరిశీలించారా? చంద్రబాబు, లోకేష్‌లతో సహా టిడిపి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చెప్పిన మాట ఒక్కటే……..ఆంధ్రప్రదేశ్ నాట పొలిటికల్ సూపర్ హీరో వైఎస్ జగన్ ఒక్కడే అని. నమ్మశక్యంగా లేదా? కావాలంటే ఈ స్టోరీ చదవండి…….. మీకే అర్థమవుతుంది. అన్నట్టు గెస్ట్ హౌస్ దీక్షలు, ఇంకేవో యాత్రలూ అంటూ టూర్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నారండోయ్.

ముందుగా టిడిపి బుద్దా వెంకన్న అనే టిడిపి నాయకుడు ఏమంటాడంటే 2019లో సింహం సింగిల్‌గా వస్తుంది……. చంద్రబాబు ఒంటరిగా అన్ని ఇతర పార్టీలనూ ఎదుర్కుంటాడు అని అంటాడు. అంటే 2014లో పందుల్లా గుంపులుగా వచ్చారా అన్న ప్రశ్నకు బుద్ధా వెంకన్నే సమాధానం చెప్పాలి. ఇక 2014లో సింగిల్‌గా దేశం మొత్తం నమో మేనియా ఊగిపోతుండగా మోడీని, చంద్రబాబు, పవన్‌లను సింగిల్‌గా ఎదుర్కున్న వైఎస్ జగన్ సింహం అని కూడా బుద్ధా వెంకన్న ఒప్పుకున్నట్టే. ఇక చంద్రబాబు, లోకేష్‌లతో సహా టిడిపి నేతలందరూ కూడా చంద్రబాబు హీరో అని ఒంటరిగానే మోడీతో సహా జగన్, జనసేనలను ఎదుర్కుంటామని చెప్తున్నారు. మరి 2014 ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు, పవన్‌లను ఎదుర్కున్న వైఎస్ జగన్ సూపర్ హీరో అని పచ్చ బ్యాచ్ జనాలు ఒప్పుకున్నట్టేనా? అయినా సూపర్ ఫాంలో, దేశం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న టైంలోనే మోడీతో కలిసిన చంద్రబాబును ఎదుర్కున్నాడు జగన్. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌కి కూడా 2014లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడులేదు. నాలుగేళ్ళు ఫాం హౌస్ రాజకీయాలు, ట్విట్టర్ రాజకీయాలతో టైం పాస్ చేశాడన్న కోపం ప్రజల్లో ఉంది. మోడీ, పవన్‌లకు సూపర్ క్రేజ్ ఉన్నప్పుడే వాళ్ళతో కలిసి పోటీ చేసిన చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కున్న హీరోయిజం జగన్‌ది. అన్నింటికీ మించి జాతీయస్థాయిలో సూపర్ క్రేజ్ ఉన్న మోడీ, రాష్ట్ర స్థాయిలో అంతే క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్‌లు కలిసినప్పటికీ గెలుపుపై నమ్మకం లేక, జగన్‌పై విషప్రచారంతో ఆరు వందల అబద్ధపు హామీలతో జగన్‌ని ఎదుర్కున్న హీన చరిత్ర బాబుది. ఎవ్వరితోనూ పొత్తు లేకపోయినప్పటికీ…….. గెలుపు కంటే కూడా విలువలు ముఖ్యం అని భావించి…….. రుణమాఫీ లాంటి అబద్ధపు హామీలిస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలను మోసం చేయకుండా నిజాయితీగా నిలబడ్డ హీరోయిజం జగన్‌ది. కాదంటారా? అందుకే చంద్రబాబు, లోకేష్‌తో పాటు బాబు బ్యాచ్ భజన మీడియా కూడా అప్పుడప్పుడూ పరోక్షంగా అయినా ఇలాంటి నిజాలు ఒప్పేసుకుంటూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -