Tuesday, May 14, 2024
- Advertisement -

నమ్మించి మోసం చేసి.. బెడ్రూం ఫోటోలు లీక్ చేశాడు

- Advertisement -

ఓ హీరోయిన్.. ఓ వ్యక్తిని ఎంతగానో నమ్మింది. కానీ ఆ వ్యక్తి ఆమెను బలిపశువును చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అంతేకాకుండా ఆమెతో నడిపిన శృంగారలీలల్ని బయట పెట్టి.. ఆమె పరువు తీశాడు. దాంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించి అతగాడి ఆట కట్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ హీరోయిన్ పేరు మైథిలీ. 2008లో సినిమాలోకి వచ్చింది. మలయాళంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే కిరణ్ కుమార్ అనే వ్యక్తితో ఆమెకి పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి ఇద్దరు దగ్గరయ్యారు. ప్రేమలో ఉన్న వాళ్లు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎలానో పెళ్లికి ఓకే చెప్పడంతో ఆమె అతనితో సహజీవనం చేసింది. అప్పుడు కిరణ్ ఏకాంతంగా గడిపిన ఫోటోలు తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అప్పటినుంచి వాటిని డిలీట్ చేయకుండా గోప్యంగా ఉంచుకున్నాడు. అంత బానే ఉంది అనుకున్న టైంలో కిరణ్‌కి ఆల్రెడీ ఒక అమ్మాయితో పెళ్లైపోయిందనే విషయం మైథిలీకి తెలిసింది. దాంతో ఆమె అతనితో రిలేషన్ తెంచుకుంది. తాను అతని చేతిలో మోసపోయినా.. అతడ్ని ఏమీ చేయకుండా తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. కానీ.. అతడు మాత్రం ఊరుకోలేదు. తన దగ్గరున్న ప్రైవేట్ పిక్స్‌ని అడ్డం పెట్టుకుని, మైథిలీని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తాను పిలిచినప్పుడల్ల వచ్చి తనను సుఖపెట్టాలని.. లేకపోతే తన దగ్గరున్న ప్రైవేట్ పిక్స్ లీక్ చేస్తాడని మైథిలీని బెదిరించడం స్టార్ట్ చేశాడు కిరణ్. కానీ మైథిలీ బెదరకుండా.. ఏమైన చేస్కో అంటూ రివర్స్ పంచ్ ఇచ్చింది. దాంతో ఆగ్రహానికి గురైన కిరణ్.. చివరికి ఆ ప్రైవేట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో లీక్ చేశాడు.

అంతే.. కొద్ది క్షణాల్లోనే అవి వైరల్ అయిపోయాయి. అంతేకాదు.. వీడియో కూడా లీక్ చేశాడు. అది రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది. అది చూసి ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాము ఎంతో అభిమానించే నటి.. ఇంత దిగజారిందా? అంటూ కుంగిపోయారు. విషయం తెలుసుకున్న మైథిలీ.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -