Friday, May 10, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ద్ద‌తు కోసం జ‌న‌గ్ ప్ర‌య‌త్నం…

- Advertisement -

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు మ‌హాసంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు ఒక ఎత్తు …అయితె ఏపీలో మ‌రో ఎత్తు. మంద‌స్తు ఎన్నిల నేప‌థ్యంలో అన్ని పార్టీలు అల‌ర్ట్ అయ్యాయి. ఇప్ప‌టినుంచె ఎన్నిక‌ల హ‌డావుడిని మొద‌లు పెట్టాయి. ప్ర‌ధానంగా టీడీపీ ,మైసీపీ మ‌ధ్య‌నె  పోటీ ఉంటుంద‌న‌డంలో సందేహంలేదు. మ‌రో సారి అధికారంలోకి రావాలని టీడీపీ….త‌మ స‌త్తాచాటాల‌ని వైసీపీ ఉవ్వీల్లూరుతున్నాయి. అయితె ప్ర‌ధానంగా పొత్తులు ప్ర‌ధాన పాత్ర వ‌హించ‌నున్నాయి.

టీడీపీ దాని మిత్ర‌ప‌క్షం భాజాపా ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక వైపు బాబుకు స‌న్నిహితంగా ఉంటూనె..స‌మ‌యం వ‌చ్చిన‌పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇక వైసీపీ కూడా ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. అయితే జ‌గ‌న్ చేస్తున్న ఒంట‌రి పోరు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. ఇక ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే పార్టీ గెలుపుపై పీకె కూడా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఒంట‌రిగా పోటీ చేస్తె ప‌రిస్థితులు అనుకూలించ‌వ‌నె సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని పీకె జ‌గ‌న్‌కు సూచించార‌ని తెలుస్తోంది.

పీకె సూచ‌న‌ల‌ను జ‌గ‌న్ పాటిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నంద్యాల ఉపఎన్నిక‌లు, కాకినాడ కార్పోరేష‌న్‌ ఎన్నిక‌ల ఫ‌లితం దెబ్బ‌తో పార్టీని ప‌టిష్టం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ కొత్త వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగా త్వ‌ర‌లో త‌మ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ద్ద‌తు కోర‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో కూడా పీకె ఇదే విష‌యాన్ని సూచించిన సంగ‌తి తెలిసిందే. ఇదే జ‌రిగితె జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మే. ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -