Saturday, May 18, 2024
- Advertisement -

మోడీ కీ నోట్‌ యాప్‌ వెనక ఉన్న నిజం ఇదే!

- Advertisement -
modi key note fake

దేశంలో ఉన్న నల్లడబ్బును బయటకు తీయడానికి ప్రధాని నరేంద్ర మోడీ పాత 500, 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పాత నోట్ల ప్లేస్ లో కొత్త 500, 2వేల నోట్లను ప్రవేశపెట్టారు. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో కొందరు కొత్త నోట్ల కోసం పాకులాడుతుంటే ఆ నోట్లు దొరికిన మరికొందరు తమకు లభించినవి అసలైనవా., నకిలీవా అని తేల్చుకోవడానికి పాట్లు పడుతున్నారు.

ఇలాంటి సమయంలో మీ వద్ద ఉన్న కొత్త రూ. 2వేల నోటు లేదా కొత్త రూ. 500 నోటు నిజమైనదా లేదా నకిలీదా అని తెలిపే యాప్‌ అంటూ మోడీ కీ నోట్‌ యాప్‌ను కొందరు రూపొందించారు. ఇప్పటికే ఈ యాప్‌ను చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కానీ అసలు సంగతి ఏంటంటే.. అది మీ నోటు అసలైనదా నకిలీదా అని మాత్రం చెప్పదు. మీరు ఆ యాప్‌ ద్వారా నోటును స్కాన్‌ చేస్తే నోట్ల రద్దు ప్రకటిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగ వీడియో ప్రసారమవుతుంది అంతే.

మీరు యాప్‌ ద్వారా 500, 2000 నోటునే కాకుండా ఇతర ఏ నోటును అయిన స్కాన్‌ చేసిన మోడీ ప్రసంగ వస్తుంది. సో ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్ లో చాలానే ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నది అసలైనదా నకిలీదా అని ఇలాంటి యాప్‌లను నమ్మి మోసపోకండి. ఇలాంటి యాప్స్ క్రీయేట్ చేసి బాగా బిజినేస్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి యాప్స్ ను అసలు నమ్మకండి. మీకు నమ్మకం కలగాలి అంటే ఈ యాప్ ను ఓ సారి డౌన్ లోడ్ చేసి ఏ నోటు అయిన స్కాన్‌ చేసి చూడండి మీకే అర్ధం అవుతుంది.

{youtube}TcaJNIeU_Wc{/youtube}

Related

  1. వామ్మో.. మోడీ ఇలా వాయించేస్తున్నారేంటి?
  2. మోడీని నడి రోడ్డులో అలా చేసినా తప్పు లేదు : నారాయణ
  3. మోడీ దగ్గర ఇంకా బోలెడు మాస్టర్ ప్లాన్ లు .. చుక్కలు చూపించ బోతున్నాడు
  4. మోడీ దెబ్బకి బలైనా టాలీవుడ్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -