Saturday, May 18, 2024
- Advertisement -

డైలాగ్ కింగ్ పుట్టిన రోజు

- Advertisement -

తెలుగు సినిమా జనాలకి ‘ క్రమశిక్షణ ‘ అనే పేరు చెబితే చాలు మోహన్ బాబు గుర్తుకు ఒస్తారు. సెట్ లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా , ఆలస్యంగా ఒచ్చినా మోహన్ బాబు కి నచ్చదు అనే విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కి భారీ అభిమాని అయిన ఆయన కి దాసరి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ లతో కూడా సాన్నిహిత్యం ఉండనే ఉంది.

క్రమశిక్షణ అనేది వారిద్దరి నుంచే నేర్చుకున్నాను అని చెబుతున్నారు మోహన్ బాబు.ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా క్రమశిక్షణ గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇప్పుడు ఎవ్వరికీ క్రమశిక్షణ లేదు అనడం మొదలు పెట్టారు. “సెట్ లో ఐదు మంది ఉంటే నలుగురైనా క్రమశిక్షణ తప్పుతుంటారు. అలా రోజుకి నలుగుర్నైనా సెట్ లో కొడుతుంటా. ” అన్నారు ఆయన.

ముఖ్యంగా డైరెక్టర్ అవ్వకపోవడానికి ఇదే కారణం అని చెప్పుకొచ్చారు బాబు. తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్ధుల మధ్యన మోహన్ బాబు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. ఎనీ వేస్ డైలాగ్ కింగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -