Tuesday, May 7, 2024
- Advertisement -

నాగార్జున ను ఎన్టీఆర్ బాబాయ్ అని ఎందుకు పిస్తాడంటే..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ హీరోకి ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చి రికార్డు సృష్టించాడు. కెరీర్ మొదట్లో హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత కాస్త వెనక పడ్డారు అని చెప్పాలి. ఆ తర్వాత మళ్లీ కెరీర్ ను స్ట్రాంగ్ చేసుకొని.. మంచి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు. వరస విజయలతో మంచి జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ ఇటివలే బుల్లితెరపై బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రేటింగ్ విషయంలో కూడా ఈ షో ముందు స్థానంలో ఉంది. అయితే ఎన్టీఆర్ హీరో నాగార్జునను బాబాయ్ అని ఎందుకు పిస్తారో తెలుసా..? ఎన్టీఆర్ తండ్రి.. ఎన్టీఆర్ బాబాయి బాలయ్య.. సినిమాలో స్టార్ హీరోలు గా ఉన్న సమయంలో నాగార్జున కూడా సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నారు. బాలకృష్ణ తో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

హరికృష్ణకు కూడా నాగార్జున తో మంచి అనుబధం ఉంది. అయితే నాగార్జునను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఎన్టీఆర్.. చిన్నప్పటి నుంచే బాబాయ్ అని పిలిచేవారట. అదే ఎన్టీఆర్ కు ఇప్పటికి అలవాటు కావడంతో నాగ్ బాబాయ్ అంటూ పిలుస్తుంటాడు. ఇక ఇటివలే నాగ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్’ షో భారీ విజయం సాధించడంతో కంగ్రాట్స్ చెబుతూ నాగార్జున ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ తారక్. నీ ఎనర్జీ ఎంతో నచ్చింది. నీ వల్లే ఈ షో ఓపెనింగ్ వీక్ లో ఫెంటాస్టిక్ రేటింగ్స్ సాధించింది’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ట్వీట్ కు ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్. మా అందరికీ అలాంటి బాటలు వేసిన మీ గొప్ప ప్రయత్నం ఫలితమే అది” అంటూ నాగార్జునకు రిప్లై ఇచ్చారు తారక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -