Monday, May 6, 2024
- Advertisement -

‘శ్రీమంతుడు’ లో బొత్స సత్తిబాబును టార్గెట్ చేశారా..?!

- Advertisement -

‘శ్రీమంతుడు’ సినిమా ఏదో కమర్షియల్ దారిలో సాగిపోదు. ఈ సినిమా కథానుసారం కరెంట్ ఇష్యూస్ ను పరోక్షంగా టచ్ చేస్తుంది.

ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఊర్లను దత్తత తీసుకోవాలనే ఉద్యమాన్ని మొదలు పెట్టాడు.

ఈ విషయంలో ఆయన రాజకీయ, సామాజిక సినీ ప్రముఖులకు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో హీరో తన ఊరిని దత్తత తీసుకొని దాన్ని బాగు చేయడం అనే కాన్సెప్ట్ ను వాడారు.

మరి ఈ సినిమాలో విలనిజం ఛాయలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్న మంత్రిగా ఉండి.. తమ్ముడు లిక్కర్ సిండికేట్లతో బిజినెస్ చేసుకోవడం ఈ సినిమాలో విలనిజం లక్షణాలు. అది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రతిబింబించే పరిస్థితులు కనిపిస్తాయి సినిమాలో!

ఇప్పుడు కాదు కానీ.. వెనుకటికి అయితే సత్తిబాబు మంత్రిగా ఉండేవాడు.. అలాగే లిక్కర్ మాఫియా కుంభకోణంలో కూడా సత్తిబాబు వంటి వాళ్లపై ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ ఈ సినిమా పరోక్షంగా బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసిందని సోషల్ మీడియాలో ఈ రకమైన పోస్టింగ్స్, కామెంట్స్ వస్తున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో  ‘శ్రీమంతుడు’ విలనిజంలో ఆ స్ఫూర్తి ఉందని కొంతమంది అంటున్నారు. అయితే ఎవరూ ధ్రువీకరించడం లేదు. మరి అసలు స్పూర్తి ఏమిటో.. దాని వెనుక ఉన్న కథ ఏమిటో ‘శ్రీమంతుడు’ సినిమా దర్శక, నిర్మాత, హీరోలే చెప్పాలి!

సినిమాను సినిమాలాగా చూడాలి కాని ఇలా వ్యక్తిగతమైన విమర్శలు చేసి, విలన్లను వాళ్ళతో వీళ్ళతో పొల్చడం మంచిది కాదని మరోవైపు ఈ రకమైన కామెంట్స్ కూడా సోషల్‌ మీడియాలో వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -