నోకియా మొబైల్స్‌కు ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉందో అదరికీ తెలిసిందే.మొబైల్ రంగంలో ఒక వెలుగు వెలిగిన నోకియా ఆండ్రాయిడ్‌తో పనిచేసె మొబైల్స్ మార్కెట్‌లోకి రావడంతో డిమాండ్ తగ్గింది. అయితే ఇప్పుడు తన బ్రాండు ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది.
నోకియా కొత్త ఓనర్ హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ ను అధికారికంగా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. 2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
ఫోన్ దరను అందరికీ అందుబాటులో ఉండేందుకు నోకియా 3310 ఫోన్ ను 3,310 రూపాయలకే విక్రయానికి ఉంచనుంది.హెచ్ఎండీ గ్లోబల్ రూపొందించిన తొలి ఫోన్ ఇదే కావడం గమనర్హం.విక్రయానికి తీసుకొస్తున్న దేశాల్లో కూడా భారత్ కే మొదటి స్థానం కల్పించింది ఆ కంపెనీ. డార్క్ బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో నాలుగు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. పాత నోకియా 3310కి చాలా మార్పులనే చేసి, ప్రస్తుత వెర్షన్ ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసు కుందాం.
3310 ఫోన్ ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే
1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్)
రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్
16ఎంబీ ఫోన్ స్పేస్
32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు
2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
ఈఫోన్ ద్వారా తగ్గిపోయిన తన మార్కెట్‌ను పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈఫోన్‌కు బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు. మరి వినియేగ దారులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Related