Friday, March 29, 2024
- Advertisement -

ఐదు నిమిషాల్లో పుల్ చార్జింగ్ గ‌ల బ్యాట‌రీలు రాబోతున్నాయి…

- Advertisement -
Smart phones that charge in five minutes arrive next year

ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్‌ల యుగం కొన‌సాగుతోంది.అన్నం లేక‌పోయినా ఉండ‌గ‌ల‌రేమోగాని ఒక్క క్ష‌ణం స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండ‌లేరు.పోన్‌లో చార్జింగ్ అయిపోతే చెప్పాల్సిన ప‌నిలేదు ఫోన్ భాధితుల గురించి. చార్జింగ్ ఎక్కాలంటే క‌నీసం గంటైనా స‌మ‌యం ప‌డుతుంది.ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు.

ఎందుకంటె ఐదు నిమిషాల్లోనే పుల్ చార్జింగ్ గ‌ల ఫ్లాష్‌ బ్యాటరీలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ ‘స్టోర్‌ డాట్ కంపెని ఈబ్యాట‌రీల‌ను వ‌చ్చే ఏడాది అందుబాటులోకి తేనుంది.వీటిని మార్కెట్‌లోకి తీసుకు రావడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు స్టోర్‌ డాట్ సీఈవో డొరొన్‌ మియర్స్‌డార్ఫ్ ప్ర‌ముఖ వార్తా చాన‌ల్‌తో చెప్పారు.ఫ్లాష్‌ బ్యాటరీలు ఐదు నిమిషాల్లోనే చార్జ్‌ అవుతాయని తెలిపారు. వీటిని తయారు చేసేందుకు ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆసియా ఖండానికి చెందిన రెండు బ్యాటరీ తయారీ సంస్థలు పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాయని ఆయ‌న తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అత్యంత వేగంగా బ్యాటరీ చార్జింగ్‌ చేయగల సాంకేతిక పరిజ్ఞానం గురించి 2015లో స్టోర్‌ డాట్ వెల్లడించింది. లాస్‌ వెగాస్‌లోని జరిగిన సీఈఎస్‌ టెక్‌ షోలో ఫ్లాష్‌ బ్యాటరీలను ప్రదర్శించింది. సాంప్రదాయేతర చర్యలను ప్రేరేపించే పదార్థాలతో ఈ బ్యాటరీలను తయారు చేసినట్టు డొరొన్‌ తెలిపారు. యానోడ్‌ నుంచి కాథోడ్‌కు అయాన్లను పంపించే ఎలక్ట్రిక్‌ ప్రక్రియను వేగవంతం చేసే పదార్థాలను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు.వ‌చ్చే సంవ‌త్స‌రం ఈబ్యాట‌రీలు అందుబాటులోకి రానున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -