- Advertisement -

లేడీస్ బీర్ కొడితే మంచిదా….?

- Advertisement -

ఏ సర్వే ఉద్దేశ్యమైనా ఒక్కటే. అదే విషయ విశ్లేషణలో ఫైనల్ గా వచ్చే ఫలితం.

కాని ఒక్కోసారి సర్వేలు ఇచ్చే రిపోర్ట్ చూస్తే…. నవ్వాలో ఎడ్వాలో అస్సలు అర్ధం కాదు. ఒకసారి ఒక టాపిక్ పై సర్వే జరిపితే వచ్చే రిజల్ట్ ను పబ్లిక్ కు తెలియజేసి ఒక అభిప్రాయానికి వచ్చేలా చేస్తారు.తర్వాత అదే టాపిక్ పై మరొకరు సర్వే చేసి వేరే రిపోర్ట్ ను అందిస్తారు.దీంతో ఏ రిపోర్ట్ ను కొలమానం చేసుకోవాలో జనాలకు అస్సలు అర్ధం కాదు.తాజాగా లేడీస్ బీర్ కొట్టడమనే కాన్సెప్ట్ పై సర్వే జరిగింది.

అందుల్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే… లేడీస్ బీర్ కొడితే వారికి గుండె పోటు వచ్చే అవకాశం 30 శాతం తక్కువట.విశేషమేమిటంటే…..ఈ సర్వేను స్వీడన్ లోని గోదెన్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన సల్ గ్రెన్స్కా అకాడమీ

పరిశోధకులు  గత 50 ఏళ్ల నుంచి చేయడం విశేషం . ఈ యాబై ఏళ్లకాలంలో దాదాపు 1500 మంది మహిళలపై ఈ పరిశోధన జరిగింది. 1968 నుంచి 2000 వరకు 70, 92 ఏళ్ల మధ్య వయస్సు మహిళలను ఈ పరిశోధనకు ఎంపిక చేశారు. అయితే మితంగా తాగే మహిళలకు మాత్రమేఈ సర్వే వర్తిస్తోందని వారు చెబుతున్నారు.ఓకే ఇదే నిజమనుకుందాం. 

మరి రేపన్న రోజు ఇంకో సర్వేలో దీనికి వ్యతిరేకంగా రిపోర్ట్ వస్తే…ఈ రిపోర్ట్ చూసి తాగడం మొదలు పెట్టిన మహిళలు దానిని ప్రామణికంగా చేసుకుని ఉన్న ఫలంగా బీర్ కొట్టడం మానేస్తారనుకోవాలా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -