Saturday, May 18, 2024
- Advertisement -

జగన్‌ని కాపీ కొట్టడం…… జగన్ ఓట్లు కొల్లగొట్టడం….. పవన్‌కి బాబు అప్పజెప్పిన బాధ్యత ఇదేనా?

- Advertisement -

పవన్ కళ్యాణ్ నట రాజకీయం రోజు రోజుకూ మరీ నాటకీయంగా తయారవుతోంది. సినిమాల్లో కూడా పవన్ పెద్దగా ఎప్పుడూ నటించింది లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం పిచ్చి పిచ్చిగా నటించేస్తూ ఉన్నాడు. అక్కడే అడ్డంగా దొరికిపోతూ ఉన్నాడు. జగన్‌ని కాపీ కొడుతూ ఉండడం……..జగన్ ఓట్లను కొల్లగొట్టడం అనే బాబు రచించిన రాజకీయ వ్యూహాన్ని రక్తికట్టించడం కోసం నానా పాట్లూ పడుతున్నాడు. కాకపోతే అత్తారింటికి దారేది సినిమాలో పవనే చెప్పినట్టుగా ఫ్లడ్ లైట్స్ వేసిన స్టేడియంలో దాగుడుమూతలు ఆడుతూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నాడు. తన నట విన్యాసంతో చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు, నీతి, నిజాయితీ, సిద్ధాంతాలు అని మాటల్లో మాత్రమే వినిపించే కబుర్లకు కళ్ళు బైర్లు కమ్మి ఉన్న మూఢాభిమానులు మాత్రం ఇంకా భ్రమల్లో ఉన్నారు.

మత రాజకీయాలు చేయను అని చెప్పే పవన్ తన భార్య క్రిష్టియన్, తన కూతురిని క్రిష్టియన్ సాంప్రదాయంలో పెంచుతున్నాను అని ఎందుకు చెప్తున్నట్టు? మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం, పూనం కౌర్ వ్యవహారం అంటే వ్యక్తిగత విషయాలపై దాడి చేస్తున్నారు అనే పవన్…..తన వ్యక్తిగత విషయాలు చెప్పి క్రిష్టియన్ ఓట్లు కొల్లగొట్టాలని ఎందుకు రాజకీయం చేస్తున్నట్టు? ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ప్రజా యాత్రకు బయల్దేరే ముందు చేసినట్టుగానే పవన్ కూడా తన క్రిష్టియన్ భార్యతో అలాంటి కార్యక్రమమే చేయించడం వెనకాల ఉద్ధేశ్యం ఏంటి? ఇక రైతు రాజకీయం అంటూ చేస్తున్న స్టంట్స్ వెనుక ఉద్ధేశ్యం ఏంటి? గ్రామీణ ఓటర్లు, రైతులు, మైనారిటీల్లో జగన్‌కి ఎక్కువ మద్ధతు ఉంది అన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆ ఓట్లలో చీలికతీసుకురావడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే పవన్‌కి చంద్రబాబు ఇచ్చిన టార్గెట్. పవన్ రాజకీయం వెనకాల ఉద్ధేశ్యం అదే.

అలాంటి రాజకీయాలు చేసే పవన్……అనంతపురం రైతులకు ఎవరు అండగా నిలబడతామని గట్టిగా చెప్తారో వాళ్ళకు 2019లో మద్దతిస్తానని చెప్పడం హాస్సాస్పదంగా ఉంది. నేను చంద్రబాబు భజనసేనుడిగా మాత్రమే రాజకీయాలు చేయట్లేదు అని జనాలను నమ్మించడానికి కాకపోతే ఈ మాటలకు అసలు అర్థం ఉందా? ఒకవేళ చంద్రబాబు అనంతపురం రైతులకు అండగా నిలబడే పనైతే ఇప్పుడే ఆ పనులు చెయ్యమని బాబును డిమాండ్ చెయ్యొచ్చుగా పవన్? ఈ ఐదేళ్ళలో చేయనివాళ్ళు వచ్చే ఐదేళ్ళలో చేస్తామని చెప్తే మాత్రం పవన్ ఎలా నమ్ముతాడట? ఇలాంటి సోది చెప్పే 2014లో మోడీకి, చంద్రబాబుకు ఓట్లు వేయించి సీమాంధ్రులను అడ్డంగా ముంచాడు పవన్. 2019వరకూ చంద్రబాబు అనంతపురం రైతులకు ఏమీ చేయడని పవన్‌కి కూడా అర్థమైనట్టే ఉంది. మరి అలాంటప్పుడు బాబుతో పోటీపడి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఇతర నాయకుడు జగన్ ఒక్కడే. మరి అనంతపురం రైతులకు ఏం చేస్తాడో జగన్ ఇప్పటికే చెప్పి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అయితేనేమి, పవన్‌కి అయితేనేమి చంద్రబాబు ఫెయిల్ అయిన నేపథ్యంలో మద్దతు ఇవ్వడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ జగనే. మరి జగన్‌కి మద్దతిస్తానని పవన్ చెప్పగలడా?

ఇప్పటి వరకూ ఏ ఒక్క కోర్ట్ కూడా జగన్‌ని దోషిగా తేల్చనప్పటికీ…….కోర్టులో కేసులు ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో జగన్‌ని అవినీతిపరుడిగా చిత్రీకరించే విషప్రచారానికి ఒడిగట్టిన పవన్……చంద్రబాబు కూడా విమర్శించని స్థాయిలో ఏకంగా వైకాపా హఠావో అని నినదించాడు. ఇక ఓటుకు కోట్లు కేసు గురించి మాట్లాడమంటే మాత్రం చంద్రబాబుకు నైతిక మద్ధతివ్వాలు, రాజకీయాలు చేయకూడదు, కోర్టులో కేసు ఉన్నప్పుడు మాట్లాడను లాంటి సోది కబుర్లు చెప్పాడు. ఇక్కడే అర్థమైపోవట్లేదా పవన్ నైజం ఏంటో? చంద్రబాబు జోబులో బొమ్మగా ఉంటూ కూడా బాబు కోసం కాదు……ప్రజల కోసమే రాజకీయం అని ప్రజలను నమ్మించాలన్న ప్రయత్నం నవ్వు తెప్పిస్తుందే తప్ప నమ్మకంగా కలిగించే అవకాశం అయితే అస్సలు లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -