Thursday, May 2, 2024
- Advertisement -

మరిన్ని నీతులు చెప్పిన పవన్ కల్యాణ్..!

- Advertisement -

సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విటర్ లో స్పందించారు. ఈ మధ్యన వరసగా ట్విటర్ లో  వివిధ అంశాల గురించి ట్వీట్ చేస్తూ వస్తున్న జనసేన అధినేత తాజాగా మరోసారి ట్వీట్ చేశారు.

అయితే ఈ సారి పవన్ రాజకీయ అంశాల గురించి కానీ.. ఇతర సామాజిక అంశాల గురించి కానీ స్పందించలేదు. కేవలం తనకు తోచిన కోట్స్ ను మాత్రమే ట్వీట్ చేశాడాయన… ప్రముఖుల కోట్స్ ను పవన్ ట్వీట్ చేశాడు.

మరి రాజకీయ అంశాల  గురించి స్పందించే పవన్ ట్విటర్ ఖాతా నుంచి ఈ ట్వీట్స్ మాత్రం వచ్చాయి ప్రస్తుతానికి. మొన్నటి వరకూ పవన్ ట్వీట్లు రాజకీయంగా చర్చనీయాంశాలు గా మారాయి. పవన్ ట్వీట్లపై తెలుగుదేశం ఎంపీలు విరుచుకుపడటం.. ఆ తర్వాత తెలుగుదేశం ఎంపీలకు పవన్ సమాధానం చెబుతూ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం మళ్లీ పవన్ రాజకీయ అంశాల గురించి స్పందించలేదు.

“యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాం,యుద్ధము రక్తము కన్నీరు  తప్ప,గాయాలు బాధలు వేదనలు  తప్ప, కలలు కలలు కలలు తప్ప,పిరికితనం మోసం తప్ప.”Seshendra

“He that is Good for making excuses is seldom Good for anything else.”  Benjamin Franklin

ఈ రెండు ట్వీట్లనూ పెట్టాడు జనసేనాని. మరి రాజకీయాలతో సంబంధం లేకుండా.. గొప్ప వ్యక్తుల మాటలను ట్వీట్ చేస్తూనే పవన్ ట్విటర్ ద్వారా టచ్ లో ఉండే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -