ఓ ఇద్దరు యువతులు అసహజ శృంగారంలో మునిగి తేలుతున్నారు. అయితే ఆ దేశంలో అది చట్ట విరుద్ధం కావడంతో పోలీసులు వారిని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ కేసులో వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఆఫ్రికాలోని మొరాకోలో ఇద్దరు యువతులను పోలీసులు స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
వీరిద్దరికీ మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది. 16, 17 ఏళ్ల వయసున్న ఈ యువతులు బహిరంగంగానే కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడంతో పాటు అసహజమైన శృంగారానికి పాల్పడుతున్నారన్న కారణంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వీరిని బెయిల్ పై విడుదల చేశారు. మొరాకోలో 489 సెక్షన్ ప్రకారం… స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
అయితే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 489 సెక్షన్ ను రద్దు చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని ఆ దేశ ప్రజలు ప్రభుత్వ చట్టాలపై మండిపడుతున్నారు. బాలికలకు మద్దతుగా ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫొటోను ప్రచురించింది. ‘మేము భిన్న లింగ సంపర్కులం. ఎల్జీబీటీ హక్కులకు మద్దతు ఇస్తా’ మంటూ ఇద్దరు మహిళలతో ఉన్న ఫొటో పెట్టింది.
Related