Sunday, May 19, 2024
- Advertisement -

టాప్ హీరోల సెంటిమెంట్లు!

- Advertisement -
Star Heroes sentiments

టాలీవుడ్ టాప్ హీరోలందరూ.. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. ఒక్క సూపర్ హిట్ సినిమా ఇస్తే చాలు పిలిచి మ‌రీ ఆ డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చేస్తున్నారు మ‌న బ‌డా హీరోలు. పిలిచి మ‌రీ చాన్స్ ఇచ్చినందుకు ఆ డైరెక్టర్లు కూడా మాట నిలబెట్టుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంకు వస్తే… జ‌ల్సా, అత్తారింటికి వంటి హిట్ సినిమాలు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ మ‌రో సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు.

అలాగే గోపాల గోపాల ఫేం డాలి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప‌వ‌న్” కాట‌మ‌రాయుడు” సినిమా తీస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఇక మ‌హేష్ కూడా శ్రీమంతుడు వంటి క్లాసిక‌ల్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ‌తో మ‌రో సినిమా తీయ‌బోతున్నాడు. అలాగే పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌హీ సినిమా రాబోతుంది. నాగార్జున కుడా త‌న‌కు శ్రీరామ‌దాసు,అన్న‌మ‌య్య వంటి డివోష‌న‌ల్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు తో “ఓం న‌మో వేంక‌టేశాయ ” చిత్రం రాబోతుంది.

అంతేకాదు “సోగ్గాడే చిన్ని నాయ‌న” ఫేం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్ “బంగార్రాజు “సిన‌మా తీయ‌బోతున్నాడు. ఇక చాలా విరామం త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడుతున్న మెగాస్టార్ చిరంజీవీ కూడా ఇదే బాట‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.”ఠాగూర్” వంటి సెన్సేష‌న‌ల్ హిట్ ఇచ్చిన వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవీ త‌న 150 వ చిత్రం “ఖైదీ నం 150” టైటిల్ తో మ‌ళ్లీ వెండి తెర మీద కు రాబోతున్నాడు. ఈ చిత్రం ఈ సంక్రాంతికే రాబోతుంది.

Related

  1. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  2. కమల్ హసన్ తో గౌతమి విడిపోయింది!
  3. రోజాకు బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్!
  4. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -