Wednesday, April 24, 2024
- Advertisement -

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

- Advertisement -

టాలీవుడ్ హీరోలు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటారన్న విషయం మనకు తెలిసిందే. వీరి జీవన శైలి కూడా చాలా కాస్ట్లీ గా ఉంటుంది. ఖరీదైన ఇల్లు, కారు, స్థలాలను కలిగి ఉంటారు. తమకు ఇష్టమైన సన్నిహితుల కోసం ఖరీదైన లగ్జరీ కార్లను కూడా ఈ హీరోలు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇటీవల ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ కోసం లక్షల విలువ చేసే కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. నితిన్ కూడా తన ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములకు లగ్జరీ కార్ ను ఇచ్చాడు. వీరే కాదు గతంలో కూడా కొంత మంది హీరో తమకు ఇష్టమైన సన్నిహితుల కోసం ఖరీదైన కార్లను గిఫ్ట్ లు గా ఇచ్చారు. వారేవరో ఇప్పుడు చూద్దాం.

1) ప్రభాస్:

తన ఫిట్నెస్ ట్రైనర్ అయిన లక్ష్మణ్ రెడ్డికి రూ.85లక్షల విలువ గల ఖరీదైన లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్.

2) నితిన్:

నితిన్ కు ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకే ఇతనికి రూ.85లక్షల విలువగల రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

3) నాగశౌర్య:

‘ఛలో’ చిత్రం సూపర్ హిట్ అయ్యాక తన పేరెంట్స్ కు 1.25 కోట్ల విలువ గల పోర్స్చే 718 సైమన్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు నాగశౌర్య.

4) రాంచరణ్:

చిరంజీవి 59వ పుట్టినరోజుకి గాను 1.25 కోట్ల విలువగల ల్యాండ్ క్రూజర్ వి8 కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు చరణ్.

5) నమ్రత టు మహేష్ బాబు:

మహేష్ బాబు 35వ పుట్టినరోజు సంధర్భంగా నమ్రత 1.5 కోట్ల విలువగల రేంజ్ రోవర్ వోగ్ కారుని ప్రెజెంట్ చేసింది.

6) మహేష్ బాబు:

‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న మహేష్ బాబుకి.. ‘శ్రీమంతుడు’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను అందించాడు దర్శకుడు కొరటాల శివ. అందుకు గాను మహేష్ బాబు 2015 లో 50 లక్షల విలువగల ‘న్యూ ఆడి ఎ6’ కారుని కొరటాలకు బహుమతిగా అందించాడు మహేష్.

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

టీచర్ ను పెళ్లి చేసుకున్న భూమిక..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -