ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి ఫుడ్ కన్న బయటి ఆహారమే అధికంగా అధికంగా తింటూ ఉంటాము. ఏదైనా హోటల్లోనైనా లేదా రోడ్డు పక్కన బండి పైన ఉండే ఆహారాన్ని తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాము. ముఖ్యంగా రోడ్లపై బండిపై చేసే ఇడ్లీలు, వడలు, దోసె వంటివి ఎక్కువగా తింటూ ఉంటాము. అయితే రోడ్లపై పెట్టె కారణంగా ఆ ఆహార ప్రదార్థాలపైనా దుమ్ము ధూళి వంటివి చెరీ కలుషితం అవుతాయి అయినప్పటికి అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా అలాగే తింటూ ఉంటాము. ఫలితంగా ఫీడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యం బారిన పడుతూ ఉంటాము. ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా విరోచనలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి.
ఇంకా ఈ ఫుడ్ పాయిజన్ వల్ల టైఫాయిడ్ కూడా అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఫుడ్ పాయిజన్ ను నిర్లక్ష్యం చేయకూడని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక ఇంట్లో కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వండిన ఆహార పదార్థాలపై మూతలు సరిగా ఉండేలా చూస్లుకోవడం, కిచెన్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.ఫుడ్ పాయిజన్ అయిన తరువాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !
- ఫుడ్ పాయిజన్ అయిన వారికి వాంతులు, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావడం సాధారణం. అయితే మన ఇంట్లో దొరిగే జీలకర్ర, వాము ద్వారా ఈ సమస్యలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. ముందుగా వాము జీలకర్ర గింజలను కొద్దిగా వేయించి పొడి చేసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే.. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పడుతుంది.
- వెనిగర్ కూడా పుడ్ పాయిజన్ నుంచి విముక్తి కొరకు చక్కగా ఉపయోగ పడుతుంది. వినిగర్ లోని జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి. దాంతో శరీరంలోని చెడు మూలకాలు బయటకు పోయి.. ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
- ఇక ఫుడ్ పాయిజన్ పై యాపిల్ కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కు కారణమైన బ్యాక్టీరియాను అరికట్టే స్వభావం యాపిల్ లో పుష్కలంగా ఉంటుంది. అలాగే అరటి పండులో ఉండే పొటాషియం కూడా ఫుడ్ పాయిజన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తులు యాపిల్, అరటి పండు వంటి వాటిని తీసుకోవడం వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంది.
- ఇక ఫుడ్ పాయిజన్ కు మరో చక్కటి పరిష్కారం తులసి ఆకుల రసాన్ని తాగడం. తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ ఉండడం వల్ల కడుపులో ఉండే బ్యాక్టీరియాపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఇవి కూడా చదవండి
వృద్దాప్యంలో తల్లిదండ్రులను.. ఇలా చూసుకోండి!