Wednesday, May 15, 2024
- Advertisement -

గ్యాస్ సమస్య ఉందా.. ఇలా చేయండి!

- Advertisement -

చాలమందికి రోజువారీ జీవనంలో మార్పుల కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తరచూ వేదిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాట్ల ద్వారా గ్యాస్ సమస్య, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరంగా మారడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎసిడిటీ ని తగ్గించే మెడిసన్ వైపు మొగ్గు చూపుతూ ఉంటాము. అయితే ఈ గ్యాస్ సమస్య దరిచేరకుండా ఉండాలంటే సరైన సమయానికి భోజనం చేయడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎసిడిటీని పెంచే జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గ్యాస్ సమస్య అధికంగా వేధించే వారు ఇంట్లో దొరికే ఈ పదార్థాలను తినడం వల్ల గ్యాస్ సంస్యకు చెక్ పెట్టవచ్చట..

1.సాధారణంగా భోజనం చేసిన తరువాత చాలా మందికి అరటిపండు తినడం అలవాటుగా ఉంటుంది. ఇలా భోజనం తరువాత అరటిపండు తినడం వల్ల గ్యాస్ ఎటాక్ అవ్వదు. ఎందుకంటే అరటి లో ఉండే ఫైబర్ న్యాస్ ట్రబుల్ ను నియంత్రిస్తుంది. కాబట్టి భోజనం తరువాత ఒక గంట వ్యవదిలో అరటి పండు తినడం ఉత్తమం.
2.పుచ్చకాయ కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండులో అధికంగా నీటి శాతం ఉంటుంది. అంతే కాకుండా ఈ పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లకు గ్యాస్ ట్రబుల్ ను తగ్గించే గుణం ఉంటుంది.
3.దోసకాయ కూడా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ఫైబర్, స్టెరాల్స్ కడుపులోని మంటను తగ్గించి గ్యాస్ సమస్యకు చెక్ పెడతాయి.
4.ఇక అంజిరా పండు తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య దరి చేరదు.

ఇవి కూడా చదవండి

నోటి దుర్వాసన ను ఇలా దూరం చేసుకోండీ!

చలికాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా !

ఉదయం లేవగానే మొబైల్ చూస్తున్నారా.. జాగ్రత్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -