Wednesday, May 8, 2024
- Advertisement -

నోటి దుర్వాసన ను ఇలా దూరం చేసుకోండీ!

- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలమంది జీవన విధానంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సరైన టైమ్ కి భోజనం చేయకపోవడం లేదా టైమ్ కి నిద్ర పోకపోవడం వంటి అలవాట్లతో పాటు శరీరనికి అవసరమైన శాతంలో నీరు తాగకపోవడం, ఇలా చేస్తూ ఉంటారు చాలమంది. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడుతూ ఉంటాయి. అయితే మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నప్పటికి చాలమంది ఎక్కువ శాతం ఎదుర్కొని ప్రధాన సమస్య నోటి దుర్వాసన. ఈ సమస్య ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇతరులతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇతరులు మనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. ఇంకా చెప్పాలంటే మన నుంచి దూరంగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు. దాంతో నలుగురిలో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కోవడానికి పాటించవలసిన కొన్ని చిట్కాలను చూద్దాం !

1.కొత్తిమీర, పుదీనా వంటి వాటికి నోటి దుర్వాసనను తగ్గించే శక్తి ఉంటుంది. కాబట్టి భోజనం తరువాత పుదీనా లేదా కొత్తిమీర కొంత తీసుకుంటే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.

2.లవంగాలు, యాలకలు, సోపు, నిమ్మకాయ వంటి వాటికి కూడా నోటి దుర్వాసనను తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి తరుచూ వీటిని తినడం అలవాటు చేసుకోవాలి.
3. నోటి దుర్వాసనను పోగొట్టడంలో జపకాయ, దానిమ్మ, ఆపిల్ పండ్లు కూడా సయాయపడతాయి. కాబట్టి ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
4. అన్నిటికంటే ముఖ్యంగా నీటిని అధిక శాతం తీసుకోవాలి. రోజుకు కనీసం 4 లీటర్ల పైన నీటిని త్రాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియాకు చెక్ పెట్టవచ్చు.

5.అలాగే రోజు శుభ్రంగా బ్రేష్ చేసుకొని, నాలుకను టంగ్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి.
6.ఇంకా మౌత్ ఫ్రెషర్స్ వంటి పదార్థాలను వల్ల కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

రాత్రిపూట వెల్లుల్లి తింటే.. ఎమౌతుందో తెలిసా ?

చలికాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -