Sunday, April 28, 2024
- Advertisement -

వృద్దాప్యంలో తల్లిదండ్రులను.. ఇలా చూసుకోండి!

- Advertisement -

మన తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడూ లెక్కకు మించి కష్టపడుతూ.. ఎంతో చమటోడ్చి మనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు. మనం భవిష్యత్ లో ఎలాంటి కష్టం పడకూడదని అన్నీ సమకూర్చి మనకు అందిస్తారు. ఇక వారికి వయసు మీద పడుతున్నప్పటికి, మనకోసం ఇంకా కశ్పాడుతూనే ఉండడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే వారికి వయసు మీద పడ్డాక తల్లిదండ్రుల బరువును మోయడం పిల్లల బాద్యత. తల్లిదండ్రులను కష్టపెట్టకుండా వారి మనసుకు ఆనందం కలిగించేలా చూసుకున్నప్పుడు వారు కళ్ళల్లో చూపే ప్రేమ వలకట్టలేనిది. వృద్దాప్యంలోని తల్లి దండ్రులు చిన్నపిల్లలతో సమానం వారిని అన్నీ విధాలుగా పర్యవేక్షిస్తూ వారి మనసులు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. మరి వృద్దాప్యంలో ఉండే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పట్ల ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం !

1.చాలా మంది మగవారు పొగాకుకు బానిసగా మారిపోయి ఉంటారు. పొగ త్రాగకుండా అసలు ఉండలేరు. పొగ త్రాగడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడి క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్దాప్యంలో పొగ త్రాగడం వల్ల ఊపిరి తిత్తుల సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే సద్యమైనంత వరకు వృద్దులు పొగ కు దూరంగా ఉండాలి. చదువురాని వారికి పొగ త్రాగడం వల్ల వచ్చే నష్టాలను పిల్లలు వివరించి వారికి చెబుతూ పొగ కు దూరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.

2.వృద్దాప్యం లో ఉన్నవారు రోజుకు ఒక గంట అయిన వ్యాయామం చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, మనసు ఉల్లాసంగా ఉండడానికి వ్యాయామం చాలా ముఖ్యం. అంతేకాకుండా వృద్దాప్యం లో వచ్చే రక్తపోటు, మడుమేహం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా రోజు ఒక గంట వ్యాయామం చేయడం చాలా మంచిదని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.

3.ఇక వృద్దాప్యంలో ఉన్నవారికి మనసు చాలా ఉల్లాసంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం వారిలో ఉండే సృజనాత్మకత ను పెంపొందించే విధంగా పిల్లలు ప్రోత్సహించాలి. అంటే వారితో డాన్సులు వేయించడం, లేదా సరదాగా పాటలు పాడించడం, లేదా బొమ్మలు గియిచడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఉల్లాసం, ఉత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసం బలపడుతుంది.

4.ఇక వృద్దాప్యం లో ఉన్నవారు వారి భావాలను ఇతరులకు చెప్పుకునేందుకు అమితంగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అందుకే వృదాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు వారి స్నేహితులతో గడిపే సమయాన్ని పిల్లలు వారికి ఇవ్వాలి. ఇలా వృద్దాప్యంలో ఉన్నవాళ్ళు వారి స్నేహితులతో అధిక సమయం గడపడం వల్ల వారి భారం చాలావరకు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -