Saturday, April 20, 2024
- Advertisement -

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

- Advertisement -

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె నటించింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ లో కూడా సినిమాలు చేసింది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

ఇటీవల ఈమె ‘రాశి విజన్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి అందులో తన సినీ కెరీర్ కు సంబంధించిన కీలక విషయాల గురించి చెప్పుకొస్తున్న విషయం తెల్సిందే. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెడుతుంటుంది. మహేష్ బాబు హీరోగా చేసిన ’నిజం’ మూవీలో అంత ఘాటు రొమాన్స్ సీన్స్ లో ఎందుకు నటించారని కామెంట్స్ పెట్టారు. అందుకు రాశి జవాబు ఇస్తూ.. ’డైరెక్టర్ తేజ ’నిజం’ మూవీలో నా పాత్ర గురించి ఒకటి చెప్పి.. మరొకటి తీశాడు. అందుకే ఏం చేయాలేక ఆ బోల్డ్ సీన్స్ లో చేశాను. ఒకరకంగా మోసం చేశారు. ఇష్టం లేకున్న ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని రాశీ చెప్పుకొచ్చింది.

తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది రాశి.. అదే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రకు మొదట రాశి ని అడిగారట. కానీ సినిమాలో మోకాళ్ల పైవరకు చీర కట్టుకోవాల్సి ఉంటుందనడంతో ఆమె ఒప్పుకోలేదట. అ తర్వాత ఆ పాత్ర యాంకర్ అనసూయను వరించి అనసూయ కు మంచి పేరు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.

పూరి జగన్నాథ్ కూతురు గురించి షాకింగ్ నిజాలు

ఇడియట్ హీరోయిన్ రక్షీత ఇప్పుడెలా ఉందంటే ?

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లే..!

మురళి శర్మ ఫ్యామిలీని ఎప్పుడైన చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -