Friday, May 3, 2024
- Advertisement -

జనవరిలో బినామీల అరెస్టులు తప్పవనే బాబు యాత్రలా?

- Advertisement -

నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నిర్మించుకున్న ఒక దుర్బేధ్యమైన కోటను మోడీ పూర్తిగా కొల్లగొట్టనున్నాడా? దేశంలోనే డబ్బు రాజకీయాల విషయంలో పేరెన్నికగన్న చంద్రబాబు సిసలైన బినామీల బలాన్ని పూర్తిగా దెబ్బతీయనున్నాడా? ప్రస్తుతం అన్ని ప్రశ్నలకూ అవునన్న సమాధానమే వస్తోంది. ఢిల్లీలో బాబుకు అండగా ఉంటాడనుకున్న పెద్దాయన కూడా ఇప్పుడు పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడట. చంద్రబాబును డైరెక్ట్‌గా టచ్ చేస్తే 2019 ఎన్నికల్లో సానుభూతి అస్త్రంతో ప్రజల ముందుకు వెళ్ళడం ఖాయం కాబట్టి బాబు బినామీలపై దెబ్బకొట్టాలని ఫిక్స్ అయ్యాడు మోడీ.

2014ఎన్నికల్లో తన క్రేజ్‌ని వాడుకుని ఇప్పుడు ఎపి ప్రజల ముందు దోషిగా నన్ను నిలబెట్టిన బాబును ఊరికే వదలకూడదు అన్నది మోడీ భావనగా తెలుస్తోంది. వాడుకుని వదిలేసే నైజం ఉన్న బాబుకు బుద్ధి చెప్పాలని మోడీ చూస్తున్నాడు. రుణమాఫీలతో సహా ఎన్నో హామీల విషయంలో ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు తనను అడిగే అర్హత ఉందా అని మోడీ రాష్ట్ర బిజెపి నేతలతో డైరెక్ట్‌గానే అంటున్నాడట. అందుకే 2014ఎన్నికల్లో మోడీ క్రేజ్‌ని వాడుకుని వదిలేసిన బాబుకు బుద్ధి చెప్పడం కోసం చంద్రబాబు బినామీలందరికీ చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాడు మోడీ. 2004కు ముందు హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో లాభపడ్డ ఒక సినిమా నిర్మాత కం రాజకీయ నాయకుడి నుంచి చంద్రబాబుకు మద్దతుగా ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, ఆ తర్వాత ఎన్నికల్లో బాబు గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న బినామీలలో ముఖ్యులందరి జాతకాలు మోడీ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరించారట. పకడ్బందీగా ప్లాన్ చేసి జనవరిలో అరెస్టులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ విషయాలపైన అనుమానం ఉండే చంద్రబాబు ఇప్పుడు రాజకీయ నాయకులందరినీ కలుస్తూ మద్దతు కోరుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైకి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నప్పటికీ అసలు ఉద్ధేశ్యం మాత్రం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసమే ఈ మీటింగులు అని స్పష్టం చేస్తున్నారు. మీటింగ్‌ల పేరుతో, దేశం కోసం అనే పేరు చెప్పి పాలనను పూర్తిగా గాలికి వదిలేసి, స్పెషల్ ఫైట్స్‌లో నాయకులను కలవడానికి వెళ్తూ ఉండడాన్ని ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -