- Advertisement -

రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ అయిన సుడాన్ అందాల సుంద‌రి…

- Advertisement -

సుడాన్‌కు చెందిన అనోక్‌ యాయి ఓ మోడ‌ల్‌. ఒక ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ అయిపోయింది. రాత్రికి రాత్రే ఆమెను ఈ భూమ్మీద అత్యంత అందగత్తెగా మార్చి పడేసింది. అదెలాగా అనుకుంటున్నారా…?

అనోక్‌ యాయి.. వాషింగ్టన్‌లో హోవార్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె సౌందర్య బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ క్రమంలో ఓ చిత్రం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు.. తక్కువ కాలంలోనే ఆమెను సూడాన్‌ లేడీ సూపర్‌గా చేసేసింది.

ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్‌లు సైతం టాప్‌ సెక్సీ మోడళ్లను పక్కన పడేసి ఇప్పుడు ఆమె ముఖచిత్రం కోసం ఎగబడిపోతున్నాయి. సోషియ‌ల్ మీడియాలో ఎక్కడా ఆమెపై జాతి వివక్ష కామెంట్లు రాకపోవటం విశేషం. విన‌డానికి ఇలాంటి నిజాలు ఒక్కోసారి వెలుగులోకి వ‌చ్చిన‌పుడు భరించటానికి కూడా కష్టంగానే ఉంటాయి మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -