Wednesday, May 15, 2024
- Advertisement -

జ‌ట్టు సార‌థ్యంపై రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌…..

- Advertisement -

భార‌త జ‌ట్టుకు తాత్కాలిక సారథిగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాడు రోహిత్ శ‌ర్మ‌. శ్రీలంకతో ధర్మశాల వన్డేలో ఘోర పరాజయం పాలైనా ఆ తర్వాత జట్టును సమర్థంగా ముందుకు నడిపించాడు. ఒక మ్యాచ్ మిగిలుండ‌గానే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది టీమిండియా జ‌ట్టు. ద్విశతకంతో సిరీస్‌ గెలిపించాడు. ప్రస్తుతం టీ20 సిరీస్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు

అయితే తాజాగా కెప్టెన్సీపై అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రోహిత్. భారత క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహించే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదని అన్నాడు. తొలిసారి భారత్‌కు సారథ్యం వహిస్తుండటంతో ఒత్తిడి అనుభవించాన‌న్నారు. జట్టుకు మళ్లీ నాయకత్వం ఎప్పుడు వహిస్తానో తెలియదు. అందుకే ప్రతి క్షణం నాకు కీలకమేన‌న్నారు.

తన బ్యాటింగ్‌ శైలిలో మార్పులేమీ లేవని రోహిత్‌ అన్నాడు. ‘నేను ఇతరుల్లా బంతిని బలంగా బాదలేను. అందుకే టైమింగ్‌పై ఆధారపడతా. నా బలాలు, బలహీనతలేమిటో నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకూ పోరాడతా. ఇండోర్‌ టీ20లో పిచ్‌పై పగుళ్లు వచ్చే వరకు ఎదురుచూశా. బౌండరీలకు అవకాశాలు కనిపించగానే బాదడం మొదలెట్టా. మైదానం అన్ని వైపులా బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తా. అప్పుడే ప్రత్యర్థి సారథి ఎక్కడ ఫీల్డింగ్‌ పెట్టాలో అర్థం కాక తికమకపడతాడ‌న్నాడు.

టీ20లో ద్విశతకం గురించి ఆలోచించలేదు. మరిన్ని పరుగులు చేసి జట్టును పటిష్ఠ స్థితిలో నిలపాలని భావించా. ఆటగాడికి కొన్ని సార్లు పరుగులు లభిస్తాయి. కొన్ని సార్లు కుదరదు. ఇవన్నీ ఆటలో భాగమేన‌న్నారు. సిక్సర్లు బాదడం కన్నా ఫీల్డర్ల మధ్యలోకి బంతిని పంపిస్తే మరింత ఆనందం కలుగుతుంది’ అని రోహిత్‌ అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -