Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు చంద్రబాబు, హరికృష్ణ, అశోక్ గజపతిరాజులు థియేటర్ వేదికగా నడిపించిన ఎపిసోడ్

- Advertisement -

తెలుగు ప్రజలు ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ని గుర్తుపెట్టుకుంటారని ఘనంగా చెప్తూ ఉంటుంది ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి….. చివరి దశలో ఆ మహా నటుడికి ఆత్మక్షోభను మిగిల్చిన పచ్చ బ్యాచ్. అయితే ఆ మహనీయుడికి వెన్నోపోటు పొడిచిన వైనం….ఆయన సొంత కొడుకులతోనే రాజకీయం చేసి తెలుగు దేశం పార్టీని, ఎన్టీఆర్ కష్టపడి గెలుచుకున్న ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుని….ఎన్టీఆర్‌కి ఆత్మక్షోభను కలిగించిన వెన్నుపోటు చరిత్ర కూడా తెలుగు ప్రజలు ఉన్నంతవరకూ గుర్తుండిపోతుంది. అందరూ కూడా వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ గురించే ఇప్పటి వరకూ చెప్పారు. ఎన్టీఆర్‌పైన చెప్పులేయించడం……. ఆ మహానుభావుడు కన్నీళ్ళు పెట్టుకోవడం గురించి చాలానే చెప్పారు. అయితే ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ బుద్ధా మురళి మాత్రం బసంత్ సినిమా థియేటర్ సాక్షిగా జరిగిన మరో ఆసక్తికర ఎపిసోడ్‌ని కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కోవడం కోసం చంద్రబాబు నడిపించిన వెన్నుపోటు రాజకీయం కథలో మరో ఎపిసోడ్ మీ కోసం.

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు.

మానవ సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అనురాగా లు, రాగద్వేషాలు, వెన్నుపో ట్లు, అధికారం, డబ్బు కోసం అయినవారిపై నే కుట్రలు.. కష్టాలు, కన్నీళ్ల సెంటిమెంట్లు ఇవన్నీ సినిమాలో చూస్తూ.. అది తెర అని, మనం చూసేది సినిమా అని తెలిసినా.. ఆ నాటకీయతలో లీనమై ప్రేక్షకులుగా మనం కూడా భావోద్వేగాలకు గురవుతుంటాం. సినిమాలు ప్రదర్శించే టాకీసులో అలాంటి అరుదైన దృశ్యాలు కళ్ళముందు నిజంగానే జరుగుతుంటే.. ప్రేక్షకులుగా సినిమా చూసి న కుర్చీలోనే నిజమైన ఆ సంఘటనలు చూసే అరుదైన అవకాశం కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో లభించింది.

కాచిగూడ మెయిన్‌రోడ్‌కు సంబంధం లేకుండా గల్లీలో ఉండే ఈ టాకీసు అప్పట్లో ఇళ్ల మధ్య ఉండేది. ఇప్పుడు ఏకంగా అపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. మూగ మనసులు, జీవనతరంగా లు, జీవనజ్యోతి, బలిపీఠం, ఆలుమగలు వంటి సెంటిమెంట్ కథాబలం ఉన్న సినిమాలు ప్రదర్శించిన బసంత్‌లో అంతకన్నా బలమైన సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

ఆ దుష్టున్ని బంధించండి అని జానపద సినిమాల్లో వృద్ధరా జు ఆదేశించగానే సైనికులు ఆ రాజునే బంధిస్తారు. తన వెనుక జరిగిన కుట్రలను ఆ రాజు అప్పటివరకు గుర్తించడు. గుర్తించినా ఏమీ చేయలేని దశలో గుర్తిస్తాడు. సైన్యాధ్యక్షుని కుట్రలను ఛేదిం చి తల్లిదండ్రులను విడిపించిన యువరాజుల కథలు.జానపద సినిమాల్లో సైన్యాధ్యక్షుల కుట్రలను ఛేదించిన యువరాజుల సినిమాలను మార్నింగ్ షోలుగా, విలన్లను మట్టికురిపించిన హీరోల సినిమాలు రెగ్యులర్ షోలుగా ఎన్నో ప్రదర్శించిన ఈ టాకీసులో అలాంటి సంఘటనలు నిజంగానే జరుగడం విశేషం.

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. అక్కడివరకు ఉత్సాహంగా వచ్చిన హరికృష్ణ తన తండ్రిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తూ తీర్మానం చదివి దుఃఖం ఆపుకోలేకపోయారు. సినిమాలు ప్రదర్శించే వేదికపైనే ఏడ్చేశారు. సినీ ప్రేక్షకులు సీట్లపైన మీడియా, పార్టీ నాయకులు ఇప్పుడు ఏమవుతుంది? హరికృష్ణ దుఃఖం వ ల్ల ఎన్టీఆర్‌ను దించేయాలనే నిర్ణయం మార్చుకుంటారా? ఏం చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చంద్రబాబు హరికృష్ణ భుజంపై చేయివేసి అనునయించారు. బాబు సకాలంలో స్పందించి హరికృష్ణ కన్నీటిని నిలిపివేయించారు. ఆ తర్వాత అశోక గజపతిరాజు, ఇతర నాయకులు అనునయించారు. తం డ్రిని కుమారుడు గద్దెదించినట్టు చరిత్ర పుస్తకాల్లో, సినిమాల్లో కనిపించే దృశ్యం బసంత్‌లో కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -